https://oktelugu.com/

Dhanteras 2024: ధంతేరాస్ రోజు ఈ వస్తువులు కొంటే.. ఇక ఇంట్లో సిరుల పంటే?

ఈ ఏడాది ధంతేరాస్ పండుగను అక్టోబర్ 29న జరుపుకుంటారు. ఈ పండుగను తప్పకుండా ప్రతీ ఒక్కరూ జరుపుకుంటారు. అయితే ఈ ధంతేరాస్ రోజు కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. మరి ఏ వస్తువులు ధంతేరాస్ రోజు కొని ఇంటికి తీసుకురావాలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 26, 2024 / 06:41 PM IST

    dhanteras

    Follow us on

    Dhanteras 2024: అందరూ ఎదురు చూసే దీపావళి పండుగ రానే వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. సాధారణంగా దీపావళి పండుగను ఒక రోజు మాత్రమే జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశంలో మాత్రం దీపావళిని ఐదు రోజుల ముందు నుంచే జరుపుకుంటారు. ఇందులో భాగంగా ధంతేరాస్‌ను ఉత్తర భారతదేశం ప్రజలు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఈ ధంతేరాస్‌ను ఎవరూ జరుపుకోరు. కానీ ఉత్తర భారతదేశంలో ప్రతీ ఒక్కరూ ఈ పండుగను జరుపుకుంటారు. ధంతేరాస్ పూజ చేయడం వల్ల ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ధంతేరాస్ పూజ చేయడం వల్ల వెంటన విముక్తి పొందుతారు. అయితే ఈ ధంతేరాస్ అనేది దీపావళి పండుగకి మూడు రోజుల ముందు వస్తుంది. అసలు దీపావళి పండుగ ధంతేరాస్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ధంతేరాస్ పండుగను అక్టోబర్ 29న జరుపుకుంటారు. ఈ పండుగను తప్పకుండా ప్రతీ ఒక్కరూ జరుపుకుంటారు. అయితే ఈ ధంతేరాస్ రోజు కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. మరి ఏ వస్తువులు ధంతేరాస్ రోజు కొని ఇంటికి తీసుకురావాలో తెలుసుకుందాం.

     

    దీపావళికి ముందు త్రయోదశి రోజు ధంతేరాస్‌ను జరుపుకుంటారు. ఈ రోజు ధన్వంతరీని ఎక్కువగా పూజిస్తారు. ధన్వంతరీని పూజిస్తే.. జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, అనారోగ్ సమస్యలు అన్ని కూడా తొలగి పోయి సుఖసంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది అక్టోబర్ 29న ధంతేరాస్‌ను జరుపుకుంటారు. అయితే ధంతేరాస్ రోజు ఎక్కువ మంది బంగారం, వెండి ఆభరణాలు, ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ధంతేరాస్ రోజు ఏవైనా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. అయితే ఎక్కువ మంది బంగారం లేదా వెండి వంటి వస్తువులను కొంటారు. అయితే అందరూ కూడా ఖరీదైన వస్తువులు కొనేంత స్తోమత ఉండదు కదా. అలాంటి వాళ్లు బంగారానికి బదులు కొన్ని వస్తువులను కొనుగోలు చేసిన కూడా మంచిదని, లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన కూడా తమలపాకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని లక్ష్మీదేవికి ప్రతీకగా కొలుస్తారు. ధంతేరాస్ రోజు తమలపాకులను కొని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే.. ఆ తల్లి ఆశీస్సులు లభిస్తాయని పండితులు అంటున్నారు.

     

    ధంతేరాస్ రోజు కొత్తమీర కట్టను కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే.. అసలు డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక బాధలన్ని తొలగిపోయి.. ఇంట్లో లక్ష్మీ దేవి తిష్ట వేసి కూర్చుంటుంది. అలాగే మహిళలకు పసుపు, కుంకుమ చాలా ముఖ్యం. వీటిని ధంతేరాస్ రోజు కొని తీసుకొస్తే.. మహిళలు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండటంతో పాటు తమ భర్త ఆయురారోగ్యాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు. ధంతేరాస్ రోజు చీపుర్లను కూడా కొని ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే చీపురు లక్ష్మీదేవితో సమానం. కాబట్టి ఇంటికి తీసుకురావడం వల్ల ఐశ్వర్యం, సంపద, అదృష్ట కలిసి వస్తాయని పండితులు అంటున్నారు. అలాగే ఇంట్లో గొడవలు లేకుండా కుటుంబం సంతోషంగా ఉంటుంది. ధంతేరాస్ రోజు ఉప్పును కూడా కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఉప్పును లక్ష్మీ దేవికి ప్రతీకగా కొలుస్తారు. ఉప్పును ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లే.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ నియమాలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.