https://oktelugu.com/

YS Sharmila : ఆడబిడ్డ షర్మిల కన్నీళ్లు.. సరికొత్త మలుపు తీసుకున్న ఆస్తుల వివాదం

వైయస్ షర్మిల - జగన్ మధ్య కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఆస్తుల వివాదం సరికొత్త మలుపు తీసుకుంది. షర్మిల - విజయమ్మకు జగన్ నోటీసులు పంపించగానే.. షర్మిల దానికి కౌంటర్ గా లేఖ రాశారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 26, 2024 / 07:10 PM IST

    YS Sharmila

    Follow us on

    YS Sharmila :  ఆ లేఖను టిడిపి అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. టిడిపి కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ప్రారంభించింది. ఆ తర్వాత వైసీపీ నేత పేర్ని నాని సరికొత్త విషయాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు మాతృమూర్తి అమ్మనమ్మ లోకేష్ పేరు మీద మదినగూడ లో రాసిన ఐదు ఎకరాల భూమి విషయాన్ని ప్రస్తావించారు. ఫ్యామిలీ గొడవలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. ఆ తర్వాత షర్మిల మళ్లీ మూడు లేఖలను రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీడియా కూడా పంపించారు. దీనిని సహజంగానే టిడిపి అనుకూల మీడియా హైలెట్ చేసింది. అయితే ఇది పొలిటికల్ గా డ్యామేజ్ జరుగుతున్న నేపథ్యంలో జగన్ కు అనుకూలంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆస్తుల కోసం గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని.. సొంత సోదరుడితో విభేదించడం ఎంతవరకు సరయిందని ఆయన ప్రశ్నించారు. వై వి సుబ్బారెడ్డి మాత్రమే కాకుండా ఇతర వైసిపి నాయకులు కూడా షర్మిలపై విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల తమ కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదానికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు.

    కన్నీళ్లు పెట్టుకున్నారు

    విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షర్మిల తమ కుటుంబాల్లో జరుగుతున్న ఆస్తుల వివాదానికి సంబంధించి అసలు విషయాలను వెల్లడించే ప్రయత్నం చేశారు.. ఈ సందర్భంగా తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.”వై వి సుబ్బారెడ్డి గారు ఆలోచించి మాట్లాడితే బాగుండేది. ఆస్తుల కోసం కన్నతల్లిని, తోడ పుట్టిన చెల్లిని కోర్టుకు లాగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఎంతో చేశాను. ఆయన జైల్లో ఉన్నప్పుడు 3,200 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశాను. పార్టీని బతికేలా చేశాను. ఆయనప్పటికీ నాకు ఇవ్వాల్సిన ఆస్తుల్లో వాటా ఇవ్వడం లేదు. పైగా నోటీసులు పంపిస్తున్నారు. విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. ఒక ఆడపిల్ల పై ఇలాంటి దుశ్చర్య ఎంతవరకు సమంజసమని” షర్మిల వాపోయారు. కాగా, షర్మిల చేసిన విమర్శలు తాలూకు వీడియోలను టిడిపి అనుకూల సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తుండడం విశేషం. కాగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా విలేకరుల సమావేశంలో షర్మిలను తీవ్రంగా విమర్శించారు. ఆస్తుల వివాదంలో జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు చేయడం సరికాదని షర్మిలకు హితవు పలికారు. ఆస్తుల కోసం అన్న మీద విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. షర్మిల చంద్రబాబు నాయుడు ట్రాప్ లో చిక్కుకున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. షేర్ల బదిలీ చేయడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు.