https://oktelugu.com/

Devi Navaratri 2024: శరణు.. శరణు దేవీ.. రేపటి నుంచి శరన్నవరాత్రులు.. ఈ ఏడాది పది రోజులు పూజలు

దేవీ.. అమ్మ.. భవానీ, ఆదిపరాశక్తి.. ఇలా ఏ పేరుతో పిలిచే దేవత దుర్గమ్మ. సృష్టికి మూలైమన ఆదిపరాశక్తి. ఏటా ఆశ్వయిజ మాసం శుక్ల పక్షం పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈసారి అక్టోబర్‌ 3(గురువారం) నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 2, 2024 / 01:10 PM IST

    Devi Navaratri 2024

    Follow us on

    Devi Navaratri 2024: మహాలయ అమావాస్య నేటి(బుధవారం)తో ముగియనుంది. గురువారం నుంచి ఆశ్వయిజ మాసం పాడ్యమి. ఏటా ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈసారి దేవీ నవరాత్రులు అక్టోబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు.. అమ్మవారు తొమ్మిది అలాకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తారు. అమ్మవారి పేరుతో ఉపవాసం ఉంటారు. హిందూ మతంలో దేవీ నవరాత్రులకు ప్రత్యేకత ఉంది. ఇదిలా ఉంటే.. ఈసారి నవరాత్రలు అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభమవుతుండగా ఈసారి తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు అంటే అక్టోబర్‌ 11వ తేదీ వరకు కొనసాగుతాయి. విజయ దశమి అక్టోబర్‌ 12న జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారు శైలపుత్రిగా, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా భక్తులకు దర్శనమిచ్చి పూజలందుకుంటుంది. అమ్మవారి పేరిట ఉపవాసం కూడా చేస్తారు.

    మధ్యాహ్నం నుంచి వేడుకలు..
    ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆశ్వయుజమాసం శుక్ల పక్షం అక్టోబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్‌ 4 మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. కొన్ని పంచాగాల ప్రకారం ఈసారి అష్టమి, నవమి తిథి రెండూ అక్టోబర్‌ 11న వచ్చాయి. ఈ నేపథ్యంలో నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం. అక్టోబర్‌ 12న విజయ దశమి జరుపుకుంటారు.

    4 రోజుల్లోనే 2 అరుదైన యోగాలు..
    నవరాత్రుల్లో దుర్గాదేవిని ఆరాధించడం ఆనవాయితీ. అమ్మవారిని పూజిస్తే అన్ని దుఃఖాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. జీవితం సాఫీగా సాగుతుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈసారి నవరాత్రుల్లో రెండు యోగాలు వస్తున్నాయి. ఈ సమయలో అమ్మవారిని కొలిస్తే అరుదైన యోగం పొందుతారు. ఇది సర్వార్థ సిద్ధి యోగం. ఇది శుభయోగం. ఈ యోగంలో అమ్మవారిని పూజించడం వలన కోరికలు నెరవేరుతాయి. ఈసారి నవరాత్రుల్లో నాలుగు రోజులు ఈ యోగాలు ఏర్పడుతున్నాయి. పంచాంగం ప్రకారం అక్టోబర్‌ 5న ప్రారంభమై అక్టోబర్‌ 8 వరకు ఉంటుంది. ఈసారి నవరాత్రుల్లో అరుదైన రవి యోగం కూడా ఏర్పడుతుంది. ఈ శుభయోగంలో అమ్మవారిని పూజించడం వలన సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో లాభాలు పొందుతారు.