Baba Vanga : జపాన్‌కు చెందిన మాంగా కళాకారిణి ర్యో తత్సుకి, ‘జపనీస్ బాబా వంగా‘గా ప్రసిద్ధి చెందింది. అంధురాలైన బాబా వంగా.. భవిష్యవావణితో ప్రసిద్ధి చెందింది. ఏ సంవత్సరం ఏం జరుగుతుందో ముందే పుస్తకరూపంలో రాసింది. ఇప్పటి వరకు ఆమె చెప్పినవన్నీ నిజమయ్యాయని చెబుతారు. కరోనా, యుద్ధాల గురించి బాబా వంగా ప్రస్తావించారు. అవి జరిగిన నేపథ్యంలో 2025, జూలై 5న వచ్చే మెగా సునామీ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ది ఫ్యూచర్ ఐ సా పుస్తకం..
బాబా వంగా 1999లో ప్రచురించిన ‘ది ఫ్యూచర్ ఐ సా‘ అనే పుస్తకంలో ఈ భవిష్యవాణి ఉంది. 2011 తోహోకు భూకంపం, సునామీ, 1995 కోబ్ భూకంపం, ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం వంటి గత ఘటనలను కచ్చితంగా ఊహించారు. దీంతో ఈ భవిష్యవాణి ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఈ భవిష్యవాణి జపాన్‌తోపాటు తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులు, ఫిలిప్పీన్స్‌లను ప్రభావితం చేస్తుందని, 2011 కంటే మూడు రెట్లు ఎక్కువ ధ్వంసకారిగా ఉంటుందని ఆమె పేర్కొంది.
Also Read: వెంకటేష్ చేయాల్సిన సూపర్ హిట్ సినిమాను పవన్ కళ్యాణ్ చేశాడా..?
శాస్త్రీయత చర్చనీయాంశం..
జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండటం వల్ల భూకంపాలు, సునామీలకు అత్యంత సంభావ్యత ఉన్న దేశం. నంకై ట్రఫ్ వంటి ప్రాంతాలు మెగాథ్రస్ట్ భూకంపాలకు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే, ర్యో తత్సుకి భవిష్యవాణికి శాస్త్రీయ ఆధారం లేదని, భూకంపాలు లేదా సునామీల కచ్చితమైన తేదీ, స్థలాన్ని ఊహించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జపాన్ మెటీరియాలాజికల్ ఏజెన్సీ ఈ భవిష్యవాణిని ‘అవిశ్వసనీయం‘ అని పేర్కొంది, దేశంలో బలమైన పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నాయని నొక్కిచెప్పింది.
సునామీ ప్రభావిత దేశాలు
ర్యోతత్సుకి భవిష్యవాణి ప్రకారం, సునామీ జపాన్ దక్షిణ తీరం, తైవాన్, ఇండోనేషియా, మరియానా దీవులు, ఫిలిప్పీన్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఈ ప్రాంతాలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నాయి, ఇక్కడ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సర్వసాధారణం. ఆమె కలలో ఈ సునామీ ఒక అండర్‌వాటర్ అగ్నిపర్వత విస్ఫోటనం లేదా సముద్రతీర భూకంపం వల్ల సంభవిస్తుందని, ఇది ఒక డైమండ్ ఆకారంలోని ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుందని తెలిపింది.
భవిష్యవాణి నిజమవుతుందా?
ర్యోతత్సుకి గత భవిష్యవాణులు కొంత కచ్చితత్వంతో కూడినవి కావడం వల్ల, ఈ భవిష్యవాణి పట్ల ప్రజలు ఆసక్తి, ఆందోళన చూపిస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తలు ఈ ఊహాగానాలను స్వప్నాల ఆధారితమైనవిగా, శాస్త్రీయ ఆధారం లేనివిగా పరిగణిస్తున్నారు. జపాన్‌లో బలమైన విపత్తు నిర్వహణ వ్యవస్థలు ఉన్నాయి. అధికారులు ప్రజలను శాస్త్రీయ సమాచారంపై ఆధారపడమని కోరుతున్నారు. ఈ భవిష్యవాణి నిజమవుతుందా లేదా అనేది జులై 5, 2025 తర్వాతే తెలుస్తుంది.