Super Hit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…సినిమాల సక్సెస్ లో దర్శకులు కీలక పాత్ర వహిస్తారనే చెప్పాలి…ఒకప్పుడు స్టార్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులకు మంచి సక్సెస్ లను అందించి వాళ్లను స్టార్ హీరోలుగా మార్చిన ఘనత కూడా దర్శకులకే దక్కుతోంది. ఇక ఈ మధ్యకాలంలో దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతుందనే చెప్పాలి. స్టార్ హీరోలందరు స్టార్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయితే చాలు ఆ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతోంది. కథతో సంబంధం లేకుండా ఆ సినిమాకి భారీ ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. ఇక లాంగ్ రన్ లో ఆ సినిమా మంచి విజయాన్ని సాధించాలంటే మాత్రం దర్శకుడు ఆ సినిమాని ఎలా తెరకెక్కించాడు అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం. ఇక ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ లాంటి నటుడు సైతం రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) అనే సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించి 200 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టాడు.
ఇక ఇప్పుడు ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుండటం విశేషం…అయితే గతంలో వెంకటేష్ (Venkatesh) చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే కాకుండా ఆయన సినిమాల్లో సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యేది…
Also Read: ఓజీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేది అప్పుడేనా..? ట్రైలర్ వచ్చే డేట్ ను లాక్ చేసిన ప్రొడ్యూసర్…
ఇక కారణకరన్ (Karunakaran) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ (Tholiprema) సినిమా కథని కూడా మొదట వెంకటేష్ కోసమే అనుకున్నారట. కానీ వెంకటేష్ అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఆ కథ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) దగ్గరికి వెళ్లడం ఆయన ఆ సినిమా చేయడం ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడం అన్ని చకచక జరిగిపోయాయి.
మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కెరియర్ ని టర్న్ చేసిన తొలిప్రేమ సినిమా వెంకటేష్ వదిలేసుకున్న సినిమా కావడం విశేషం… ఒకవేళ ఈ సినిమా వెంకటేష్ కి కనక పడుంటే అప్పుడు వెంకటేష్ కెరియర్ అనేది మరో రేంజ్ కి వెళ్ళిపోయేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక వెంకటేష్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కలిసి చేసిన గోపాల గోపాల సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి..