Sankashti Chaturthi 2024: : కొన్ని పురాణాల ప్రకారం దీనిని కలియుగం అంటున్నారు. దీంతో మనుషులు అనేక కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. బాధలు, ఆవేదనల నుంచి విముక్తి పొందాలంటే దైవానుగ్రహం ఒక్కటే మార్గం అని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది. దీంతో చాలా మంది ఆయా దేవుళ్ల అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఏ పూజలో అయినా ముందుగా వినాయకుడికి పూజల చేస్తారు. ఆది దేవుడిగా పిలిచే గణనాథుడిని ప్రసన్నం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి విముక్తి పొందుతామని భక్తుల నమ్మకం. అయితే గణపతిని సాధారణ రోజుల్లో కంటే ‘సంకటహర చతుర్థి’ నాడు పూజ చేయడం వల్ల మరిన్ని వరాలు ఇస్తాడని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే సంకట హర చతుర్థి అంటే ఏమిటి? ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి?
గణనాథుడికి అత్యంత ప్రతీ పాత్రమైన రోజు చవితి. ఈ చవితి రెండు రకాలుగా వస్తుంది. ఒకటి వరద చతుర్థి. రెండోది సంకటహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అని అంటారు. ఇది వినాయక చవితి సమయంలో రావడంతో పది రోజుల పాటు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రెండోది సంకట హర చతుర్థి ప్రతి నెలలో పౌర్ణమి తరువాత వస్తుంది. ఈ రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వ్రతం ఆచరించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని భావిస్తారు. అయితే ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి? అనే వివరాల్లోకి వెళితే..
సంకటహర చతుర్థి రోజున పవిత్రంగా ఉండాలి. వ్రతం ఆచరించేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత తల స్నానం చేసి.. పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. వినాయకుడికి విగ్రహం లేదా చిత్రపటాన్నిశుభ్రం చేసి పూలతో అలంకరించాలి. వినాయకుడికి పసుపు రంగు పూలను అలంకరించడం వల్ల సంతోషిస్తాడని కొందరు పండితులు చెబుతున్నారు. అలాగే దర్బ గడ్డిని కూడా సమర్పించాలి. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం వల్ల చాలా సంతోషిస్తాడు. నైవేద్యంగా బూందీ లడ్డూతో పాటు మోదకాలను సమరపించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
వినాయకుడి పూజకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తరువాత సంకటహర చతుర్థి వ్రత కథను చదవాలి. ఆ తరువాత ఉపవాసం ప్రారంభించారు. పూజలు ఏమైనా తప్పులు ఉండే క్షమించాలని గుంజీలు తీయాలి. ఈరోజు మొత్తం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అయితే సాయంత్రం చంద్ర దర్శనం అయిన తరువాతనే ఉపవాసం విరమించాలి. ఆ తరువాత కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి.
2024 సెప్టెంబర్ 21న సంకట హర చతుర్థి రానుంది. దీంతో ఈరోజున వ్రతం ఆచరించేవారు పూజకు సిద్ధమవుతున్నారు. మానసిక సమస్యలు, ఎప్పటి నుంచో ఉన్న బాధలు తొలగిపోవడానికి ఈ వ్రతం ఆచరించాలని అంటున్నారు. ఏడాది అంతా పూజలు చేయని వారు సంకట హర చతుర్థి రోజు వినాయకుడిని ఆరాధించడం వల్ల అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా ఈరోజు నిష్టతో ఉండడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.