Ashadha Amavasya: ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్య ఏర్పడతాయి. అయితే ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణమే అయినా.. హిందూ క్యాలెండర్ ప్రకారం వీటిలో కొన్ని విశేషంగా పేర్కొనబడతాయి. అందులోనూ అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు. ప్రతి నెలలో వచ్చే అమావాస్య కంటే ఆషాడ మాసంలో వచ్చే ఆడి అమావాస్య ప్రత్యేకంగా ఉంటుందని కొందరు చెబుతూ ఉంటారు. ఈ అమావాస్య రోజు చేసే కొన్ని కార్యక్రమాల వల్ల పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అంతేకాకుండా వారి నుంచి పడే బాధలనుంచి కూడా విముక్తి పొందుతారని కొందరు పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఆడి అమావాస్య రోజు ఏం చేయాలి? ఏం చేయకుండా ఉండాలి?
Also Read: వీఎస్ అచ్యుతానందన్ జీవితం.. ఒక పోరాట యోధుడి ప్రస్థానం!
2025 జూలై 24వ తేదీన ఉదయం 2.25 గంటలకు ఆడి అమావాస్య ప్రారంభం అవుతుంది. తిరిగి రాత్రి 12.41 గంటలకు ముగుస్తుంది. ఈ కాలంలో పితృదేవతలకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అడి అమావాస్య రోజున సముద్ర లేదా నది స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం పొందవచ్చు. నది తీరానికి వెళ్లి పితృదేవతలకు తర్పణం పెట్టాలి. ఈ సమయంలో పూర్వికుల ఆత్మ శాంతి కోసం ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు పేదవారికి లేదా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల పూర్వీకులకు ఎంతో పుణ్యఫలం వచ్చి వారి బాధలనుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందని నమ్ముతారు.
ఈ కార్యక్రమం చేయలేని వారు ఆడి అమావాస్య రోజున నది స్నానం చేసి శివాలయాలకు వెళ్లాలి. వీలైతే రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి శివ దర్శనం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈరోజు నది స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించాలి. ఇలా చేస్తే దైవ శక్తి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.
Also Read: భారతీయ వలస జనాభా.. ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 దేశాలు ఇవే..!
అడి అమావాస్య రోజున కొన్ని పనులు చేయకుండా ఉండడమే మంచిది. సాధారణంగా ఆషాడమాసంలోనే ఎలాంటి కొత్త పనులు ప్రారంభించారు. అలాంటిది ఈ నెలలో వచ్చే అమావాస్య రోజు శుభకార్యాలు నిర్వహించకూడదు. కొత్త వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఇతరులతో వాగ్వాదాల దిగకుండా ప్రశాంతంగా గడపాలి. ప్రతికూల ఆలోచనలు చేయకుండా ఉండాలి. అలా చేస్తే దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈరోజు శుభకార్యాలు నిర్వహించకుండా ఉండాలి. ఎలాంటి వేడు కలు కూడా చేయకుండా దూరంగా ఉండాలి.
మిగతా అమావాస్యలో కంటే ఆడి అమావాస్య చాలా ప్రత్యేకమైనదని చెబుతుంటారు. ఈరోజు అశుభంగా భావించడం వల్ల డబ్బులు ఇతరులకు ఇవ్వకుండా ఉండాలి.
సూర్యుడు ప్రస్తుతం దక్షిణ యానం ప్రయాణం చేస్తాడు. ఇలాంటి సమయంలో సూర్యుడికి నమస్కరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.