Homeజాతీయ వార్తలుVS Achuthanandan Journey: వీఎస్ అచ్యుతానందన్ జీవితం.. ఒక పోరాట యోధుడి ప్రస్థానం!

VS Achuthanandan Journey: వీఎస్ అచ్యుతానందన్ జీవితం.. ఒక పోరాట యోధుడి ప్రస్థానం!

VS Achuthanandan Journey: కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నాయకులు వీఎస్ అచ్యుతానందన్ ఇకలేరు. ఆయన మరణంతో కేరళ మొత్తం కన్నీరు పెట్టుకుంటోంది. సోమవారం సాయంత్రం తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం 9 గంటల నుండి ఆయన పార్థివ దేహాన్ని దర్బార్ హాల్‌లో ప్రజల సందర్శన కోసం ఉంచారు. వేలాది మంది ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు చివరి వీడ్కోలు పలకడానికి దర్బార్ హాల్‌కు చేరుకున్నారు. అచ్యుతానందన్ కేరళ రాజకీయాల్లో ఒక విప్లవ నాయకుడిగా, నిస్వార్థ సేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత, వి.ఎస్. అచ్యుతానందన్ పార్థివ దేహాన్ని జాతీయ రహదారి గుండా ఆయన స్వగ్రామమైన ఆలప్పుళ పన్నెప్రలోని నివాసానికి తీసుకెళ్తారు. బుధవారం రోజున, ఆయన పార్థివ దేహాన్ని ముందుగా ఆలప్పుళ జిల్లా కమిటీ కార్యాలయంలో ప్రజల సందర్శన కోసం ఉంచుతారు. ఆ తర్వాత, ఆలప్పుళ పోలీస్ రీక్రియేషన్ గ్రౌండ్‌లో కూడా ప్రజా సందర్శన ఉంటుంది. చివరగా, బుధవారం సాయంత్రం 3 గంటలకు వళియచుడుక్కాట్‌లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. కేరళ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అత్యున్నత గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

వీఎస్ అచ్యుతానందన్ కేరళ రాజకీయాల్లో ఒక దిగ్గజం. 1923లో జన్మించిన ఆయన, చిన్న వయసు నుంచే స్వాతంత్ర్య పోరాటంలో, కార్మిక సంఘాల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి, కేరళలో సీపీఎంకు ఒక బలమైన పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. అనేకసార్లు జైలుకు వెళ్లారు, పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. అయినా తన ఆశయాలకు, ప్రజల పక్షాన నిలబడే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు.

Also Read: పదేళ్ల బాలుడి దేశభక్తి స్ఫూర్తి.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో సాహసం!

2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆయన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల సంక్షేమం కోసం పాటుబడ్డారు. ముఖ్యంగా భూ సంస్కరణల అమలులో, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు ఉండేలా ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. 90 ఏళ్లు దాటినా, ఆయన ప్రజల సమస్యలపై స్పందించేవారు. ఆయన మరణం కేరళ రాజకీయాలకు, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని చెప్పాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version