Tirumala: కలియుగ దైవంగా పేర్కొంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటాడు. అలాగే దేశ, విదేశాల్లోని భక్తులు తిరుమలను ఒక్కసారైనా సందర్శించాలని అనుకుంటారు. తిరుమలలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది ఈ ఏడుకొండలను దర్శించుకోవాలని అనుకుంటారు. ఏడుకొండల పైన ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి రకరకాల రవాణా మార్గాలు ఉన్నాయి. వీటిలో కాలినడక కూడా ఒకటి ఉంది. కొందరు మొక్కులు చెల్లించడానికి మెట్లపై నుంచి కాలినడకన ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మరికొందరు ఇతర వాహనాలపై కొండపైకి వెళ్తుంటారు. అయితే కాలినడకన శ్రీవారిని దర్శించుకోవాలని అనుకునేవారు కొన్ని సూచనలు పాటించాలి. అవేంటంటే?
కాలినడకన తిరుమలకు వెళ్లేవారు ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాలినడకన వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఈ దారిలో మధ్య మార్గంలో ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండవు. అయితే 1500 మెట్టు వద్ద వైద్య సహాయం అందించడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారు. అలాగే కొన్ని ఆస్పత్రులు 24 గంటల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ అత్యవసర సేవలు మాత్రం దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వృద్ధులు, చిన్నపిల్లలు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాలినడకన తిరుమలకు వెళ్లకుండా.. ఇతర మార్గాల గుండా వెళ్ళవచ్చు.
కాలినడకన తిరుమలకు వెళ్లేవారు రెండు మార్గాల్లో వెళ్ళవచ్చు. ఒకటి అలిపిరి నుంచి.. మరొకటి శ్రీవారి మెట్లపై నుంచి కూడా వెళ్లవచ్చు. అలిపిరి నుంచి 3500 మెట్లు ఎక్కాల్చి ఉంటుంది. శ్రీవారి మెట్లు తక్కువగా దూరం ఉంటుంది. అయితే వాహనాలపై కూడా పైకి వెళ్లే అవకాశం ఉంది. కొందరు సొంత వాహనాలపై మరికొందరు ఆర్టీసీ బస్సులపై కూడా వెళ్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకోవాలని.. సంతోషంగా ఉండాలని కోరుకునే వారు ఆయా అవసరాలను బట్టి ప్రయాణం ఏర్పాటు చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బలవంతంగా అలిపిరి మెట్లపై లేదా శ్రీవారి మెట్లపై తిరుమలకు వెళ్లకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారి తల్లిదండ్రులు వారిని తీసుకెళ్లి సామర్థ్యం ఉంటేనే కాలినడకన వెళ్లాలి.
ప్రస్తుతం దసరా పండుగ సందర్భంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీవారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు అనుగుణంగా టీటీడీ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లను చేస్తుంది. దసరా పండుగ సందర్భంగా తిరుమల స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య తక్కువగానే ఉన్నా.. బ్రహ్మోత్సవాలకు మాత్రం జనం బాగా వస్తున్నారు.