Custard Apple: మార్కెట్లో దొరికే కొన్ని రకాల పండ్లతో ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. కొన్ని సీజనల్ పండ్లు విటమిన్లతో పాటు ఖనిజాలు లభిస్తూ ఉంటాయి. అయితే ఇవి మార్కెట్లోకి వచ్చినప్పుడే తీసుకోవడం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో సీతాఫలాలు సందడి చేస్తున్నాయి. ఎటు చూసినా ఇవి కుప్పలు తెప్పలుగా తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. సీతాఫలాలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యం. సీతాఫలాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలు లేకుండా చేస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి. సాధ్యమైనంతవరకు ఇవి మార్కెట్లోకి వచ్చినప్పుడు తినాలని కొందరు వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. అయితే సీతాఫలాలను కొందరు అస్సలు రుచి చూడొద్దని అంటున్నారు. వారు ఎవరంటే?
సీతాఫలం పండులో విటమిన్లు, ఖనిజాల తో పాటు ఇందులో చక్కెర విలువలు అధికంగా ఉంటాయి. సహజమైన కార్పో హైడ్రేట్లతోపాటు గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది.అటిమోయ అనే సీతాఫలంలో 25% చక్కెర కలిగి ఉంటుందని కొందరు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అలాగే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. చక్కెర నిలువలు ఎక్కువగా ఉండడంతో సీతాఫలంలో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తినకపోవడమే మంచిదని అంటుంటారు. అయితే వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు సైతం సీతాఫలం పండుకు దూరంగా ఉండడమే ఆరోగ్యకరమని అంటున్నారు. ఈ రకమైన వారు సీతాఫలం ను తినడం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది.
అయితే ఎలాంటి వ్యాధులు లేని వారు మాత్రం సీతాఫలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. సి విటమిన్ శరీరంలోకి వెళ్లడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపిస్తుంది. సీతాఫలం ను తినడం వల్ల బీటా కెరటిన్ విటమిన్ ఏగా మారుతుంది. ఫలితంగా రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ తో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు సీతాఫలంను తినడం వల్ల సమస్య నుంచి బయటపడతారు.
ఈ పండులో పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. పొటాషియం తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. అలాగే గుండె సమస్యల నుంచి బయటపడతారు. మెగ్నీషియం సీఎం కూడా ఇందులో లభిస్తుంది. సీఎం తీసుకోవడం వల్ల నరాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే కండరాల పటిష్టం కోసం కూడా సహాయపడుతుంది.
సీతాఫలంలో ఇవి మాత్రమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగించి కణాల వృద్ధిని పెంచుతాయి. ఇలా ఎన్నో రకాలుగా విటమిన్లు, ఖనిజాలు ఉండడంవల్ల సీతాఫలమును తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమే. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు.. ఇతర ఆరోగ్య సమస్యల తో బాధపడేవారు సీతాఫలం కు దూరంగా ఉండాలి. లేకుంటే కొత్త సమస్యలు వచ్చి మరింత ఇబ్బందులను పడే అవకాశం ఉంటుంది.