https://oktelugu.com/

Raviteja : రవితేజ కెరియర్ కష్టాల్లో పడ్డట్టేనా..? మరి దీనికి సొల్యూషన్ ఏంటి..?

కొంత మంది హీరోలు డిఫరెంట్ సినిమాలను చేస్తూ వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటారు. ఇక మరికొందరు మాత్రం రోటీన్ రెగ్యూలర్ కథలతో సినిమాలను చేస్తారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 16, 2024 / 08:17 AM IST

    Hero Raviteja Career

    Follow us on

    Raviteja :  మాస్ మహారాజుగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రవితేజ.. ఒకప్పుడు ఆయన చాలా మంచి సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలు గా చేసి మంచి విజయాలు అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక అలాంటి రవితేజ కమర్షియల్ సినిమాలను చేయడమే కాకుండా కథలతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే రవితేజ రెమ్యూనరేషన్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ కథల మీద పెట్టడం లేదంటూ వార్తలైతే వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కూడా దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అసలు ఆ సినిమాలో ఏదో ఒక చిన్న కథ లైన్ ను పట్టుకొని రెండున్నర గంటల పాటు సినిమా చేయాలని అనుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాతో రవితేజ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా తీవ్రంగా నిరాశ పరిచడానే చెప్పాలి. అసలు సినిమాల్లో ఉండాల్సిన కొన్ని మంచి సీన్స్ కూడా ఈ సినిమాలో లేకపోవడం చాలా దారుణం అనే చెప్పాలి. అయితే కొన్ని సీన్లు మరి సిల్లీగా ఉండడం అవన్నీ చూసిన జనాలకి రవితేజ ఎందుకు ఇలాంటి నాసిరకం కథలతో సినిమాలను చేస్తున్నాడు.

    ఒక మంచి కథతో మళ్ళీ మార్కెట్లోకి వస్తే రవితేజ కి ఉన్న గుర్తింపు చాలావరకు పెరిగిపోతుంది కదా అంటున్నారు. ఇక ఏదో రెమ్యూనరేషన్ వస్తుంది కదా కాలం గడుస్తుంది అనుకుంటూ ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళ్తే మాత్రం ఫ్యూచర్ లో రవితేజ కెరియే అనేది భారీగా నష్టపోయే అవకాశం అయితే ఉంది. ఇక ఇప్పటికే మార్కెట్ పరంగా చూసుకుంటే రవితేజ కి అంత గుర్తింపు అయితే లేదు.

    ఆయన సినిమాలు మినిమం కొత్త హీరోలతో పాటు కూడా పోటీ పడలేకపోతున్నాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త హీరోలందరూ 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతూ పాన్ ఇండియా స్టార్ హీరోలుగా సూపర్ సక్సెస్ సాధిస్తున్నారు మరి రవితేజ మాత్రం తెలుగులోనే మంచి సినిమాలను చేయడానికి కూడా చాలా వరకు సతమతమవుతున్నాడు. ఇక వీటన్నింటికి చెక్ పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. లేకపోతే మాత్రం రవితేజ హీరోగా తన కెరియర్ ను ముగించాల్సిన అవసరమైతే ఉంటుంది.

    ఇక ఇప్పటికే వరుసగా 5 ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఇక దాంతో రవితేజ కెరియర్ కొంతవరకు రిస్క్ లో ఉందనే చెప్పాలి. ఇక మీదట చేసే సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే కావడం విశేషం…ఇక కమర్షియల్ సినిమాలకి ఆల్మోస్ట్ కాలం చెల్లింది ఎంతో కొంత సినిమాల్లో వైవిధ్యం లేకపోతే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే రోజులైతే లేవు. ఎందుకంటే ప్రపంచ సినిమా మొత్తాన్ని మనం ఓటిటిలో చూస్తూన్నాం అలాగే ప్రతి ప్రేక్షకుడు ఆ కంటెంట్ ను కూడా ఆస్వాదిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడో 15 సంవత్సరాల కిందట వచ్చిన కథలతోనే ఇంకా రోటీన్ ఫార్మాట్లో సినిమాలు చేస్తే మాత్రం హీరోలు, దర్శకులు షెడ్డు కి వెళ్ళిపోవాల్సిందే…