Festivals in April 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెలలో చాలా పండుగలే ఉన్నాయి. ఈ నెలలో చైత్రమాసం, ఉగాది పండుగ, శ్రీ క్రోధి నామ తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇదే నెలలో హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి కూడా జరుపుకుంటారు. మరి ఈ నెలలో జరుపుకునే పండుగలు ఏంటో ఓ సారి చూసేద్దాం.
శీతల అష్టమి.. ఏప్రిల్ 2న అంటే ఈ రోజునే శీతల అష్టమి జరుపుకుంటారు. ఈ రోజు శీతలా మాతను పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. ఈ రోజు పిల్లలు ఉండే ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు ఆ తల్లికి.
ఏప్రిల్ 5న ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉంటే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. బాధలు కూడా తొలిగిపోతాయట. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయట. ఏప్రిల్ 7న చతుర్దశి శివరాత్రి వ్రతం పాటించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ పరమశివుని ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు.
సోమావతి అమావాస్య.. సోమవారం వచ్చే ఈ సోమవతి అమావాస్యను పవిత్రమైన రోజుగా చూస్తారు. ఈ రోజు పూర్వీకులు దానధర్మాలు చేసేవారు. దీనివల్ల విశేష ఫలితాలు ఉంటాయట. మహిళలు భర్త ఆయుష్యు బాగుండాలి అని పూజలు చేస్తారు.
ఉగాది పండుగ.. చైత్ర మాసం పాడ్యమి తిథి ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం అవుతుంది. అంటే హిందూ నూతన సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభం. ఇదే రోజున చైత్ర నవరాత్రులు ప్రారంభం అవుతాయి కాబట్టి తొలిరోజు శైలపుత్రిని పూజిస్తారు భక్తులు.
రంజాన్.. ఈల్ ఉల్ ఫితర్ అనేది ముస్లింల ముఖ్యమైన పండుగ. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు నెల రోజులు ఉపవాసం ఉంటారు. అయితే ఏప్రిల్ 11న నెలవంక దర్శనం చేసి రంజాన్ పండుగను జరుపుకుంటారు.
శ్రీరామ నవమి. చైత్ర నవరాత్రులలో భాగంగా ఏప్రిల్ 17న శ్రీరామ నవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. ఆ రోజున అయోధ్యలో గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ పవిత్రమైన రోజున అయోధ్యకు వెళ్లే భక్తులు నదిలో స్నానాలు చేస్తారు.
కామద ఏకాదశి.. చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటారు. ఏప్రిల్ 19న ఈ ఏకాదశి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటారు. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటున్నారు పండితులు.