https://oktelugu.com/

Peddireddy: పెద్దిరెడ్డిని భయపెడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి

గత ఐదు సంవత్సరాలుగా రాయలసీమ రాజకీయాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముద్ర చెరగనిది. జగన్ కంటే పెద్దిరెడ్డి హవా నడుస్తూ వస్తోంది. దీంతో పెద్దిరెడ్డి చాలా దూకుడుగా ముందుకు వెళ్లారు. ఆయన బాధితులుగా రెడ్డి సామాజిక వర్గం నేతలు మిగిలారు.

Written By:
  • Dharma
  • , Updated On : April 2, 2024 12:34 pm
    Peddireddy

    Peddireddy

    Follow us on

    Peddireddy: ఎంతటి కాకలు తీరిన యోధులైనా.. సరైన ప్రత్యర్థి ఎదురైతే కాస్త వెనక్కి తగ్గాల్సిందే. లేకుంటే మూల్యం తప్పదు. ఇప్పుడు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అదే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి చిత్తూరులోనే కాదు.. రాయలసీమలో కూడా తనకు తిరుగులేదని భావిస్తున్న నాయకుడు పెద్దిరెడ్డి. మొత్తం వైసీపీ రాజకీయాలను శాసిస్తున్నారు. ప్రత్యర్ధులను కట్టడి చేస్తూ వచ్చారు. అయితే ఎప్పుడు పరిస్థితి ఒకేలా ఉండదు. అందులోనూ రాజకీయాల్లో అస్సలు ఉండదు. అందుకే ఇప్పుడు సీన్ మారింది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో పెద్దిరెడ్డికి అతి పెద్ద సవాల్ ఎదురవుతోంది.ఈసారి కిరణ్ నుంచి పెద్దిరెడ్డికి సెగలు తగులుతున్నాయి. పెద్దిరెడ్డి బాధిత వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని కిరణ్ తన వైపు తిప్పుకుంటున్నారు.

    గత ఐదు సంవత్సరాలుగా రాయలసీమ రాజకీయాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముద్ర చెరగనిది. జగన్ కంటే పెద్దిరెడ్డి హవా నడుస్తూ వస్తోంది. దీంతో పెద్దిరెడ్డి చాలా దూకుడుగా ముందుకు వెళ్లారు. ఆయన బాధితులుగా రెడ్డి సామాజిక వర్గం నేతలు మిగిలారు. అయితే ఇప్పటివరకు పెద్దిరెడ్డి అంటే గిట్టని రెడ్డి నాయకులు సైలెంట్ గా ఉండేవారు. ఇప్పుడు కిరణ్ ఎంట్రీ తో ఆయనకు వారు దన్నుగా నిలుస్తున్నారు. రాజంపేట కూటమి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డిని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా రాజంపేట నియోజకవర్గం లో కిరణ్ పర్యటిస్తున్నారు నేతల మద్దతు కోరుతున్నారు. దీంతో పెద్దిరెడ్డి వర్గంలోని రెడ్డి నాయకులు సైలెంట్ గా కిరణ్ కు మద్దతు ప్రకటిస్తున్నారు.నిజానికి పెద్దిరెడ్డిని ఇక్కడ రెడ్లు కొన్నాళ్లుగా దూరం పెడుతున్నారు.కనీసం తమకు చిన్నచిన్న పనులు కూడా ఇవ్వకుండా పెద్దిరెడ్డి వర్గమే అన్ని పనులు చేస్తుంది. కనీసం చేసిన పనులు కూడా డబ్బులు ఇప్పించకుండా పెద్దిరెడ్డి ఇబ్బంది పెడుతున్నారు. అదే ఇప్పుడు ఆయనకు మైనస్ గా మారింది. కిరణ్ కుమార్ రెడ్డికి ప్లస్సుగా మారనుంది.

    రాజంపేట నియోజకవర్గం నుంచి రెండోసారి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అక్కడ పేరుకే ఎమ్మెల్యేలు కానీ అందరూ డమ్మీలే. వైసీపీ కీలక నేతలతో పాటు రెడ్డి సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారందరికీ కిరణ్ కుమార్ రెడ్డి ఆశాదీపంలా మారిపోయారు. ఎలాగైనా పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టాలని వారంతా భావిస్తున్నారు. అందుకే సైలెంట్ గా మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో సైతం కిరణ్ కు మద్దతుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇక్కడ పెద్దిరెడ్డికి కిరణ్ తో చిక్కులు తప్పేలా లేవు.

    మరోవైపు భారత చైతన్య యువజన పార్టీ తరఫున బోడె రామచంద్ర యాదవ్ గట్టి సవాల్ విసురుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో యాదవులతో పాటు బీసీ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం తన గెలుపు కోసమే ఆయన ప్రచారం చేయడం లేదు. పెద్దిరెడ్డి కుటుంబ పతనాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో పుంగనూరులో టిడిపి నేతలంతా ఒక తాటిపైకి వస్తున్నారు. కూటమి తరుపున బరిలో దిగిన రామచంద్రారెడ్డికి ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నారు. దీంతో పెద్దిరెడ్డి ఫస్ట్ టైం పుంగనూరులో భయపడుతున్నారు.