Gold Purchase: బంగారం.. ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే లోహం. ఇక భారత దేశంలో అయితే మహిళలు బంగారం అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.70 వేలు దాటింది. దీంతో సామాన్యులకు అందకుండా పోతోంది. సంపన్నుల ఇంటికే చేరుతోంది. పెట్టుబడిదారులు బంగారంపైనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుండడంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంత ధర పెట్టి బంగారం కొంటున్నవారు.. వాటి క్వాలిటీ విషయంలో మాత్రం మోసపోతూనే ఉన్నారు.
ఏటా 7 లక్షల కిలోల బంగారం..
భారత దేశంలో ఏటా 7 లక్షల కిలోల బంగారం కొంటున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. దీనిని బట్టి భారతీయులు బంగారాన్ని ఎంతలా ఇష్టపడతారో అర్థం చేసుకోవచ్చు. ఇంతలా కొనుగోలు చేస్తున్నా.. ధర మాత్రం తగ్గడం లేదు. దశాబ్దం క్రితం రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఉన్న తులం బంగారం ఇప్పుడు ఏకంగా రూ.70 వేలకు పెరిగింది. ఇక ఏదైనా వస్తువును కొన్ని దాచిపెడితే అది పాడవుతుంది. ధర తగ్గుతుంది. కానీ బంగారం కొని పెడితే దాని విలువ మాత్రం పెరుగుతూనే ఉంది.
కొనే ముందు ఇవి చెక్ చేసుకోండి..
ఇక భారతీయ శుభకార్యాల్లో బంగారం తప్పకుండా వాడతారు. బంగారం కొనేందుకు షాప్‌కు వెళ్లినప్పుడు షాప్‌వాళ్లు చెప్పింది కాకుండా మనకు కూడా బంగారంపై కాస్త అవగాహన ఉంటే.. ప్యూరిటీ గురించి స్వయంగా తెలుసుకోవచ్చు. మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా షాపువాడు చెప్పింది నమ్మితే మోసపోవడం ఖాయం. క్వాలిటీలో 24 క్యారెట్ బంగారం అత్యం నాణ్యమైనది. ఇక మనం కొనుగోలు చేసేది 22 క్యారెట్స్ గోల్డా లేక 20 క్యారెట్స్ గోల్డా లేక 18 క్యారెట్ గోల్డా అనేది తెలుసుకోవాలి. ఈ విషయాలను ఇలా తెలుసుకోవచ్చు.
= 18 క్యారెట్ గోల్డ్ అయితే దానిపై 0.750 అని రాసి ఉంటుంది. 20 క్యారెట్ గోల్డ్ అయితే దానిపై 0.833 అని రాసి ఉంటుంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ అయితే దానిపై 0.916 అని రాసి ఉంటుంది. ఈ మూడు నంబర్లు కచ్చితంగా బంగారంపై ఉంటాయి. ఉండాలి. షాపువాడు చెప్పేది సరైనదో కాదో తెలియాలంటే ఈ విషయాలు తెలిసి ఉండాలి. 0.750 అని ఉండి 22 క్యారెట్ అని చెబితే.. మనం నమ్మామంటే మోసపోతాం. మనకు లెక్క తెలిస్తే షాప్‌వాడు దొరికిపోతాడు.
ఏ క్యారెట్‌కు ఎంత విలువ ఉంటుంది. క్యాలిటీ, ప్యూరిటీ ఎంత అనే విషయాలు తెలిసి ఉంటే.. మోసపోయే అవకాశం ఉండదు. ఎందుకంటే అది బంగారం మరి. విలువ పెరుగూతూనే ఉంటుంది. మరో దశాబ్దంలో రూ.1 లక్షల అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.