https://oktelugu.com/

Anjaneya: చేతిలో ధనుస్సుతో వెలిచిన ఆంజనేయుడు.. తరలివస్తున్న భక్తులు.. ఎక్కడో తెలుసా?

రామాయణంలో ఆంజనేయుడి పాత్ర ప్రధానంగా ఉంటుంది. రాముడు, సీత తరువాత ఆంజనేయుడి పేరే ఎక్కువగా వినిపిస్తుంది. చిరంజీవిగా పేరొందిన హనుమంతుడు ఇప్పటికీ జీవించే ఉన్నాడని హిందూమత శాస్త్రం తెలుపుతుంది. అందువల్ల భక్తుల కష్టాలు, దోషాలు, భయాలు పొగొట్టేందుకు ఆంజనేయస్వామి వెన్నంటే ఉంటారని అంటారు.

Written By: , Updated On : December 17, 2024 / 11:56 AM IST
Ramagundam anjaneya swamy

Ramagundam anjaneya swamy

Follow us on

Anjaneya: రామాయణంలో ఆంజనేయుడి పాత్ర ప్రధానంగా ఉంటుంది. రాముడు, సీత తరువాత ఆంజనేయుడి పేరే ఎక్కువగా వినిపిస్తుంది. చిరంజీవిగా పేరొందిన హనుమంతుడు ఇప్పటికీ జీవించే ఉన్నాడని హిందూమత శాస్త్రం తెలుపుతుంది. అందువల్ల భక్తుల కష్టాలు, దోషాలు, భయాలు పొగొట్టేందుకు ఆంజనేయస్వామి వెన్నంటే ఉంటారని అంటారు. దేవుళ్లలో ఇతరులతో సమానంగా ఆంజనేయుడిని కొలుస్తారు. ప్రతీ ఏడాది ఆంజనేయ స్వామి దీక్షలు నిర్వహిస్తుంటారు. ఆంజనేయుడిని కొలిచేందుకు ప్రతీ గ్రామంలో విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. వీటిలో ఆంజనేయుడు ఎదురుగా లేదా పక్క వైపు చూస్తు కనిపిస్తాడు.కానీ ఇక్కడ స్వయంభూగా వెలిచిన ఓ ఆంజనేయ స్వామి చేతిలో ధనుస్సుతో కనిపించాడు. ఆ వివరాల్లోకివెళితే..

సాధారణంగా ఆంజనేయుడు అనగానే చేతిలో గదతో కనిపిస్తాడు. రామాయణంలో శత్రువులను జయించడానికి ఆంజనేయుడి గద ఉపయోగపడుతుంది. అలాగే మరికొన్ని చిత్ర పటాల్లో ఆంజనేయుడు చేతిలో సంజీవని పర్వతం ఉంటుంది. రామాయణంలో లక్ష్మణుడు మూర్చపోతే సంజీవని పర్వతాన్ని తీసుకొస్తారు. ఇంకో చిత్ర పటంలో ఆంజనేయుడు ధ్యానం చేస్తూ కనిపిస్తారు.కానీ ఎక్కడా చేతిలో ధనుస్సుతో కనిపించడు. కానీ ఇక్కడ ధనుర్ఫాణంతో స్వయంభూగా వెలిశారు. ఈ విషయం తెలిసిన భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగండం ప్రాంతంలోని అడవిలో ఓ గొర్రెల కాపరి వెళ్లాడు. ఇటీవల అతడికి ధనుర్పాణంతో కలిసి ఉన్న ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. దీంతో హిందూవాహిని సభ్యులకు సమాచారం తెలియజేయగా వారు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలిసిన భక్తులు ఈ ఆంజనేయుడిని చూసేందుకు తరలి వస్తున్నారు. అయితే రాముడు వనవాసంలో భాగంగా రామగుండం ప్రాంతంలో నివసించారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలో ఆంజనేయుడు ప్రత్యక్షమయ్యాడని భక్తులు అంటున్నారు.

ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానిక నాయకులు రహదారి ఏర్పాట్లు చేశారు. కొందరు ఇక్కడ దేవాలయం నిర్మిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. యితే దట్టమైన అడవి కావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఎక్కడా లేనివిధంగా ఆంజనేయుడు ఇక్కడ విల్లుతో కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు. రాముడితో కలిసి ఇక్కడికి ఆంజనేయుడు వచ్చాడని, అందుకే ఇక్కడ ఆంజనేయుడి విగ్రహం ఉందని కొందరు అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో కొందరు దూర ప్రాంతాల వారు సైతం ఆంజనేయుడిని చూసేందుకు తరలి వస్తున్నారు. కొందరు ప్రైవేట్ వాహనాలపై ఇక్కడికి ప్రత్యేకంగా వస్తున్నారు.

ఇక్కడికి వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి బస్సు సౌకర్యం ఉంటుంది. మధ్యలో రామగుండం వెళ్లి అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా చేరుకోవచ్చని అంటున్నారు. కొందరు ఆంజనేయుడి విగ్రహం గురించి తెలియగానే విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చుతున్నారు. భక్తుల సౌకర్యార్థం స్వచ్ఛందంగా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మంగళవారంఆంజనేయుడిని స్మరించడంవల్ల ఎలాంటి బాధలు ఉండవని కొందరు పండితులు చెబుతారు. అయితే స్వయంభూగా వెలిసిన ఈ స్వామిని దర్శించుకోవడంవల్ల భయాందోళనల నుంచి విముక్తి పొందుతారని అంటున్నారు. దట్టమైన అడవిలో స్వయంభూగా ఆంజనేయ స్వామి వెలియడంతో భక్తితో పూజలు నిర్వహిస్తున్నారు.