Ind Vs Aus 3rd Test: ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక మొదటి రెండు మ్యాచుల్లో మొదటి దాంట్లో ఇండియా గెలవగా, రెండోవ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక ఐదు టెస్టు మ్యాచ్ ల్లో భాగంగా మొదటి రెండు మ్యాచ్ ల్లో చెరొక విజయాన్ని సొంతం చేసుకోగా, మూడో మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే దానిమీద సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం ఇండియన్ టీమ్ చాలా లో ఎఫర్ట్స్ తో ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి మూడో టెస్టులో కనక ఇండియా గెలవకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కి అర్హత సాధించగలుగుతుందా అంటూ కొంతమంది కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మూడోవ టెస్ట్ మ్యాచ్ డ్రా అయినప్పటికి ఆ తదుపరి ఆడే రెండు టెస్టు మ్యాచ్ ల్లో ఇండియా గెలవాల్సి ఉంటుంది. అలా అయితేనే ఇండియా ఫైనల్ కి చేరుకోవడానికి ఆకాశమైతే ఉంటుంది. ఇక ‘వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ‘ లో ప్రస్తుతం ఇండియా 57.29 PCT తో మూడో స్థానం లో ఉంది. ఇక మొదటి రెండు స్థానాల్లో సౌతాఫ్రికా 63.33 PCT తో మొదటి స్థానం లో ఉండగా, ఆస్ట్రేలియా మాత్రం 60.71 తో రెండో స్థానం లో ఉంది… ఇక ఈ టెస్ట్ డ్రా దిశగా ముందుకు సాగుతున్నప్పటికి చివర లో జరిగే రెండు టెస్ట్ మ్యాచుల్లో విజయం సాధిస్తే ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ఇండియన్ టీం టాప్ 2 పొజిషన్ ను దక్కించుకునే అవకాశం అయితే ఉంది.
ఇక ఇంతకుముందే రెండుసార్లు ఫైనలిస్ట్ గా వెళ్లిన ఇండియన్ టీమ్ ఒకసారి ఆస్ట్రేలియా చేతిలో మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఘోరమైన పరాభావాన్ని మూటగట్టుకుంది. మరి ఈసారి ఫైనల్ కి వెళ్లి ఎలాగైనా సరే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కప్ గెలవాలని ఉద్దేశ్యంతో మన ప్లేయర్లు ముందుకు అడుగులు వేస్తున్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఫైనల్ కి వెళ్తారా తద్వారా కప్పుని సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ లు ఆడేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇది ఏమైనా కూడా ఈసారి కనక ఇండియన్ టీం ఫైనల్ కి వెళ్లకపోయినా, కప్పు గెలవకపోయినా ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్ లను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం అయితే ఉంటుంది…