Most Searched Cricketer: ఏవైనా విషయాలు తెలుసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్ చేస్తూనే ఉంటాం. కేవలం మనమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక విషయం గురించి రోజూ అందరూ సెర్చ్ చేస్తూనే ఉంటారు. మనకి ఏదైనా చిన్న సందేహం వస్తే చాలు.. ఒక్క క్షణం ఆలోచించకుండా వెంటనే గూగుల్‌నూ ఆశ్రయిస్తాం. కనీసం పక్కన ఎవరు ఉన్నా కూడా వారిని అడగం. దీనికి ముఖ్య కారణం గూగుల్ అయితే అసలు తప్పు చెప్పకుండా కరెక్ట్ చెబుతాదని ఉద్దేశించి నమ్మకంతో చెక్ చేస్తారు. అయితే గూగుల్ ప్రతీ ఏడాది ఎక్కువగా ఏ విషయాలు సెర్చ్ చేశారో విడుదల చేస్తుంది. ఈ ఏడాది మరో 20 రోజుల్లో పూర్తి కావస్తుంది. ఈ క్రమంలో 2024లో ఇండియన్స్ ఎక్కువగా గూగుల్‌లో ఏ విషయాలు గురించి సెర్చ్ చేశారో.. ఆ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఎందరో ప్రముఖులు, క్రికెటర్లు, సినిమా వాళ్లు, సెలబ్రిటీలు ఉన్నారు. అయితే ఇండియన్స్ ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసిన వాటి గురించి ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఇదిల ఉండగా దేశంలో ఎందరో స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా ఎందరో ఉన్నారు. వీరి గురించి ఎప్పటి కప్పుడు తెలుసుకోవడానికి కొందరు గూగుల్ సెర్చ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేసిన క్రికెటర్లలో వీళ్లు ఎవరూ లేరు. మరి ఈ ఏడాది ఏ క్రికెటర్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ ఏడాది నెటిజన్లు ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసిన క్రికెటర్‌గా హార్డిక్ పాండ్యా నిలిచారు. ఈ ఏడాది హార్డిక్ పాండ్యా టీ20 కెప్టెన్‌గా నిలుస్తారని అందరూ భావించారు. కానీ కాలేదు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. పాండ్యా కనీసం వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపిక కాలేదు. ఫ్యాన్స్ కూడా ఇలానే భావించిన కాకపోవడం వల్ల గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఐపీఎల్‌లో ముంబై జట్టుకు కెప్టెన్ అయ్యాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ పాండ్యాను విపరీతంగా ట్రోల్ చేశారు. అలాగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి ఓవర్ బౌలింగ్ వేశారు. ఈ బౌలింగ్‌తో ఒక్కసారిగా అందరూ సెర్చింగ్ మొదలు పెట్టారు. ఈ టీ20 తర్వాత కెప్టెన్ కావడం పక్కా అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ కాలేదు. ఈ టీ20 ప్రపంచ కప్ తర్వాత హార్డిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇటువంటి కారణాల వల్ల ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేశారని విశ్లేషకులు అంటున్నారు. టాప్ క్రికెటర్లు ఉండగా.. నెటిజన్లు హార్డిక్ పాండ్యాను ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేయడానికి కారణాలు ఇవే అని తెలుస్తున్నాయి. ఇలా ఏడాది అంతా కూడా ఇతని గురించి ఏదో విషయంలో చర్చించుకుంటూనే ఉన్నారు.