Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో నవ పంచమి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి కొన్ని రాశుల వారు అదనపు ఆదాయాన్ని పొందుతారు. మేషంతో సహా మీనా వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు హార్దిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విభేదాల ఉండడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఏ పని చేసినా సక్రమంగా పూర్తి కాదు. అయితే పాత స్నేహితులను కలవడం వల్ల కాస్త ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల వివాదాల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎటువంటి సమస్యనైనా వెంటనే పరిష్కరించుకోవాలి. ఆర్థికంగా బలపడేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా మారనుంది. వ్యాపారాలు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా గడుపుతారు. ఊహించని లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఓ సమాచారం మరింత ఆనందానికి గురిచేస్తుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి ప్రవర్తన వల్ల మిగతావారు బాధపడతారు. కార్యాలయాల్లో ఉద్యోగులకు అప్పగించిన పనిని పూర్తి చేయలేక పోతారు. దీంతో నిరాశతో ఉంటారు. వ్యాపారం అంతంత మాత్రంగానే సాగడంతో ఆదాయం తగ్గిపోతుంది. ఖర్చులు పెరగడంతో కృంగిపోతారు. ఇంటి అవసరాల ను తీర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ క్రమంలో జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : మీ రాశి వారు ఆర్థికంగా ఉంచుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి పెరిగే అవకాశాలు ఎక్కువ. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో ఉల్లాసంగా ఉంటారు. ఇంటి అవసరాల కోసం అదనంగా ఖర్చులు ఉంటాయి. పాత స్నేహితులను కలవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఇప్పటివరకు తీసుకున్న రుణాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని ముఖ్యమైన పనిలో వాయిదా వేసుకోవడమే మంచిది. ఏ పని మొదలుపెట్టిన ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు వారు ఈరోజు అదనపు ప్రయోజనాలు పొందుతారు. గతంలో చేపట్టిన పనులు పూర్తి కావడంతో ఉల్లాసంగా ఉంటారు. మధ్యాహ్నం తర్వాత వ్యాపారం పుంజుకుంటుంది. అయితే ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ భావాన్ని ప్రదర్శించకుండా ఉంటేనే సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఉద్యోగులు పెండింగ్ పనులను పూర్తిచేయాలి. ఈ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించుకోవాలి. రోజువారి అవసరాల కోసం అదనంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఉద్యోగులు ఉన్నదా అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇటువంటి వివాదాల్లో తలదూర్చవద్దు. ఏ పని తలపెట్టిన వెంటనే పూర్తి చేయాలి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడంతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయం నుంచి శుభవార్తలు వింటారు. అయితే కొన్ని నిర్ణయాలు మానసిక అశాంతిని కలుగజేస్తాయి. మాటలను అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వీరికి కొన్నీ పనులు పూర్తి కాకపోవడంతో నిరాశతో ఉంటారు. ఉద్యోగులు అనవసర వివాదాల్లోకి దూరితే విలువ పోతుంది. ఏ పని చేసినా ఇష్టంతోనే చేయాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ప్రణాళిక ప్రకారం పనులు చేస్తే విజయవంతంగా పూర్తి అవుతాయి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. వ్యాపారులు కొత్త పనిని ప్రారంభిస్తారు. అయితే పెద్దల సలహా తీసుకోవడం అవసరం. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రోజువారి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి అదనపు ఆదాయం చేకూరుతుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబానికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో విహార యాత్రలకు వెళ్తారు. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.