Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటి పై నేడు ఐటీ సోదాలు జరిపిన ఘటన ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి ఇంట్లో ఉదయం 5 గంటల నుండి ఈ సోదాలు ప్రారంభించారు. ఇక ఆ తర్వాత దిల్ రాజు ఇంటి తో పాటు, ఆయన ఆఫీస్ కి చెందిన 55 ప్రదేశాల్లో ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సంక్రాంతికి ఆయన నిర్మించిన ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. వీటితో పాటు బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా ఆయన నైజాం ప్రాంతం లో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలబడగా, ‘గేమ్ చేంజర్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ మూడు సినిమాలకు పోస్టర్స్ ద్వారా వందల కోట్లు వచ్చినట్టు తెలిపారు.
ముఖ్యంగా ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటి రోజే 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతీ ఒక్కరు దీనిపై చర్చించుకున్నారు. అంతే కాకుండా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి కేవలం ఆరు రోజుల్లోనే 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు పోస్టర్స్ ని విడుదల చేశారు. ఇవన్నీ వైరల్ అవ్వడం వల్లే ఆయనపై నేడు ఇలా ఐటీ దాడులు జరిగాయని తెలుస్తుంది. అయితే దిల్ రాజు టాక్సులు కట్టే విషయం లో చాలా కచ్చితంగా ఉండే మనిషి. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని నమ్మి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ ని చేసిందంటే చిన్న విషయం కాదు. చేసే ముందు వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ మొత్తం పరిశీలించే చేస్తారు కాబట్టి, దిల్ రాజు ఐటీ సోదాల్లో క్లీన్ చిట్ తో బయటపడుతారని ఆయన్ని అభిమానించే వాళ్ళు చెప్తున్నారు.
సుమారుగా 400 కోట్ల రూపాయిల లెక్కలపై సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఈ సోదాలు తర్వాత ఐటీ అధికారులు ఏమని చెప్తారో. 450 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఆయన నిర్మించిన గేమ్ చేంజర్ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా, 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మితమైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతున్నాయి. అంతే కాకుండా నైజాం, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల్లో దిల్ రాజు బాలయ్య డాకు మహారాజ్ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. ఈ సినిమాకి భారీ లాభాలు అయితే రావడం లేదు కానీ, పర్వాలేదు అనే రేంజ్ లోనే వస్తున్నాయి. మొత్తం మీద నైజాం బాక్స్ ఆఫీస్ మొత్తం ఈ సంక్రాంతిని దిల్ రాజు కబ్జా చేసేసాడు. అందుకే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.