తప్పుల తడకలో కరోనా పడగ!

తెలంగాణలో కోవిద్19 పాజిటివ్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కో రోజు 50కి పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణ సర్కార్ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లకు, జిల్లా కలెక్టర్లు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లకు అసలు సంబంధం లేకుండా ఉంటుంది. ఇటీవల సూర్యాపేటలో ఒకేరోజు 16కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ హెల్త్ బులెటిన్ ను అదే రరోజు విడుదల చేశారు. కానీ దానిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ […]

Written By: Neelambaram, Updated On : April 23, 2020 11:13 am
Follow us on

తెలంగాణలో కోవిద్19 పాజిటివ్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కో రోజు 50కి పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణ సర్కార్ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లకు, జిల్లా కలెక్టర్లు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్లకు అసలు సంబంధం లేకుండా ఉంటుంది.

ఇటీవల సూర్యాపేటలో ఒకేరోజు 16కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్ హెల్త్ బులెటిన్ ను అదే రరోజు విడుదల చేశారు. కానీ దానిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొనలేదు. తర్వాతి రోజు ఆ కేసుల వివరాలు వెల్లడించారు. అదేవిధంగా గతంలో వరంగల్ అర్బన్ జిల్లాలో కేసులు నమోదయ్యాయని హెల్త్ బులెటిన్ లో సర్కార్ పేర్కొంది. తర్వాతి రోజు అసలు వరంగల్ అర్బన్ ను మీడియా బులెటిన్ లో చేర్చలేదు. ఇలా జిల్లాల వారీగా చాలా తప్పుల తడకగా కేసుల వివరాల వెల్లడి ఉంది. దీని పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే జిల్లాల నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి కో ఆర్డినేషన్ లేదా అనే అనుమానం తలెత్తుంది. అదే విధంగా కేసుల వివరాలు రోజు వారీగానే వెల్లడిస్తున్నారా లేక ఏమైనా దాస్తున్నారా అనే సందేహాలను విపక్ష నేతలు వ్యక్తపరుస్తున్నారు. అంటే కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా సర్కార్ ప్రజలు ఆందోళన చెందకుండా వివరాలు వెల్లడిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటివరకకు తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 928కి చేరింది. వీరిలో 194 మంది కోలుకోగా 23 మంది మరణించారు. ప్రస్తుతం 711 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. అయితే కేవలం హైదరాబాద్ మహానగరంలోనే 400కు పైగా కేసులు నమోదయ్యాయి. నేడో రేపో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000ని దాటనుంది. మర్కజ్ కు వెళ్లివచ్చిన వారందరిని ఇప్పటికి కూడా ట్రేస్ చేయలేదని సాక్షాత్తు వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఎవరికి వారుగా వచ్చి పరీక్షలు చేయించుకొని సహకరించాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ప్రభావం లేదు కాబట్టి కరోనా దెబ్బ పెద్దగా తెలియడం లేదు. అయినప్పటికీ తెలంగాణలో రోజురోజుకు కేసుల సంఖ్య కుప్పలు కుప్పలుగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వ్యాప్తికి సంబంధించి ఇంకా లోతుగా ప్రజలన చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెను ప్రమాదం తప్పదు. ప్రజలు, ప్రభుత్వం యంత్రాంగం సమన్వయంతో ముందుకు పోతేకానీ ఈ మహమ్మారిని తరిమి కొట్టలేం. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే పరిస్థితి చేయి దాటే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.