https://oktelugu.com/

వలస కూలీల వేదన వర్ణానాతీతం!

అకస్మాత్తుగా దేశంలో లాక్‌ డౌన్‌ అమలుపరచడంతో వలస కూలీల బ్రతుకులు చిందరవందరగా మారిపోయాయి. దీంతో వారు సొంతూళ్లకు వెళ్లే మార్గంలేక, పరాయి పంచన ఉండలేక సతమతమైపోతున్నారు. వారిని కదిలిస్తే పుట్టెడు దుఃఖంతో స్వరం గద్గదమవుతోంది. మాటల్లో ఆవేదన, చూపుల్లో నిస్సహాయత, కన్నీటి చారికల్లో ఆందోళన, నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఆకలి వారిని దహించివేస్తోంది. చాలా చోట్ల వలస కూలీలు రాత్రిళ్లు సేదతీరుతూ, పగలు కాలినడకన సొంతూళ్లకు పయనమవుతున్నారు. అలసిపోతే రోడ్లపైనే పడుకుంటున్నారు. వారు కోరుకుంటున్నదల్లా ఒక్కటే… […]

Written By: , Updated On : April 15, 2020 / 12:18 PM IST
Follow us on

అకస్మాత్తుగా దేశంలో లాక్‌ డౌన్‌ అమలుపరచడంతో వలస కూలీల బ్రతుకులు చిందరవందరగా మారిపోయాయి. దీంతో వారు సొంతూళ్లకు వెళ్లే మార్గంలేక, పరాయి పంచన ఉండలేక సతమతమైపోతున్నారు. వారిని కదిలిస్తే పుట్టెడు దుఃఖంతో స్వరం గద్గదమవుతోంది. మాటల్లో ఆవేదన, చూపుల్లో నిస్సహాయత, కన్నీటి చారికల్లో ఆందోళన, నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల ఆకలి వారిని దహించివేస్తోంది. చాలా చోట్ల వలస కూలీలు రాత్రిళ్లు సేదతీరుతూ, పగలు కాలినడకన సొంతూళ్లకు పయనమవుతున్నారు. అలసిపోతే రోడ్లపైనే పడుకుంటున్నారు. వారు కోరుకుంటున్నదల్లా ఒక్కటే… తమ ఊర్లకు పంపించేయండని. ఈ పరిస్థితుల్లో తాజాగా మే 3 వరకు లాక్‌ డౌన్‌ పొడిగింపు వారిని మరింత కలచివేసింది. ముంబయిలో స్వస్థలాలకు వెళ్లిపోతామని వేల మంది రోడ్డెక్కారు. ఇంకా హైదరాబాద్‌ లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

సుమారు 200 మంది వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లాలని హైదరాబాద్‌ లో మూటాముల్లె సర్దుకొని, చంటి పిల్లలను ఎత్తుకొని నడుచుకుంటూ బయలుదేరారు. హబ్సిగూడ జెన్‌ పాక్‌ ప్రాంతంలోని పోలీసు తనిఖీ కేంద్రం దగ్గర అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా వెంటనే అక్కడికి చేర్చుకుని వారిని సుముదాయించారు. మీ అందరినీ తమ బిడ్డల్లా చూసుకుంటామని హామీ ఇచ్చి వారిని వాహనాల్లో వారి ఆవాసాల దగ్గరకు తరలించారు. వారికి భోజనం ఏర్పాట్లు చేశారు. చందానగర్‌ నుంచి మధ్యప్రదేశ్‌ కు దాదాపు వందమంది డీసీఎం వ్యాన్‌ లో బయల్దేరగా బాచుపల్లి చౌరస్తా వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డారు. అలాగే గచ్చిబౌలి నుంచి 200 మంది కాలినడకన బయల్దేరితే రేతిబౌలి వద్ద పోలీసులు నిలువరించి వెనక్కి పంపారు. టోలిచౌకి నుంచి మధ్యప్రదేశ్‌ కే బయల్దేరిన మరో యాభై మందికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నగరంలోనే ఇలా దాదాపు వేయి మంది ఊరెళ్లిపోవడానికి పరిపరి విధాల ప్రయత్నించారు.  తమ రాష్ట్రాలకు పంపించేందుకు అనువైన ఏర్పాట్లు చేయాలంటూ వారు వేడుకుంటున్నారు.

హైదరాబాద్‌ లోని నానక్‌ రాంగూడ ప్రాంతంలో ఒక్క చోటే 1200 నుంచి 1500 మంది వరకు వలస కార్మికులు కనిపించారు. ‘మా ఆరోగ్యం గురించి పట్టించుకొనేవారు కూడా లేరని వారు వాపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో వేల సంఖ్యాలో.. దేశం మొత్తం మీద లక్షల సంఖ్యలో వలస కూలీలా బాధలు వర్ణాన%