https://oktelugu.com/

అడ్డేడ్డే… వలస కూలీలు వెళ్లిపోయారే…!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు అష్ట కష్టాలు పడి చాలా మంది వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లకు, బడా వ్యాపారులకు చేతిలో డబ్బుంది, వ్యాపారం ఉంది. పని చేయడానికి పనివాళ్ళు లేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో నిర్మాణ కూలీల కొరత ఏర్పడింది. చేపట్టిన భారీ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో కరోనా వల్ల ఎంత నష్టం వస్తోందో… కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లిపోవడం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 25, 2020 / 05:07 PM IST
    Follow us on

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు అష్ట కష్టాలు పడి చాలా మంది వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోయారు. కాంట్రాక్టర్లకు, బడా వ్యాపారులకు చేతిలో డబ్బుంది, వ్యాపారం ఉంది. పని చేయడానికి పనివాళ్ళు లేక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో నిర్మాణ కూలీల కొరత ఏర్పడింది. చేపట్టిన భారీ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో కరోనా వల్ల ఎంత నష్టం వస్తోందో… కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లిపోవడం వల్ల కూడా అంతే నష్టం వచ్చేలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    కాంట్రాక్టర్ల ఆందోళన

    హైదరాబాద్ మెట్రోలో పనిచేసే ఒక కాంట్రాక్టర్ ఆందోళన చెందుతున్నాడు. అయనకు చెందిన చాలా మంది వర్కర్లు… గత నెల్లో తమ తమ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు పనులు ముందుకు సాగట్లేదు. కొత్త వారు దొరకట్లేదు. హైదరాబాద్ లో ఉండే చాలా మంది కాంట్రాక్టర్లకు కార్మికులు దొరకట్లేదు. అందరూ శ్రామిక్ రైళ్లలో ఇళ్లకు వెళ్లిపోయారు. మూడు వారాలైతే వర్షాలొచ్చేస్తాయి. ఆలోగా పూర్తి చేయాల్సిన పనులు హైదరాబాద్ వ్యాప్తంగా కొండల్లా పేరుకుపోయాయి. వలస కూలీలే అభివృద్ధికి డ్రైవింగ్ ఫోర్స్‌ లా ఉండేవారనీ… వారు లేకపోవడంతో… హైదరాబాద్ సహా… అన్ని మెట్రో నగరాల్లో కార్మికుల కొరత ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌ లో ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులతోపాటూ… ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టులు వందల కొద్దీ ఉన్నాయి. హైవేల పనులు, మెట్రో పనులు కూడా భారీగానే ఉన్నాయి. కానీ పనివారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు.