తెలుగు తమ్ముళ్లకు సామాజిక దూరం వర్తించదా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నెలల తరువాత రాష్ట్రానికి వస్తున్న సంతోషంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లాక్ డౌన్ నిబంధనలు గాలికొదిలేశారు. చంద్రబాబు కాన్వాయ్ తెలంగాణా బోర్డర్ ఏపీలో ప్రవేశించిన క్రమంలో స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు సామాజిక దూరం, మాస్క్ లు ధరించడం చేయలేదు.కంచికచర్ల, నందిగామ నియోజకవర్గ కేంద్రాలలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ లు శ్రీరామ్ రాజగోపాల్, తంగిరాల సౌమ్య వందల సంఖ్యలో కార్యకర్తలతో వచ్చి బాబు, లోకేష్ లకు స్వాగతం […]

Written By: Neelambaram, Updated On : May 25, 2020 6:36 pm
Follow us on


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండు నెలల తరువాత రాష్ట్రానికి వస్తున్న సంతోషంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లాక్ డౌన్ నిబంధనలు గాలికొదిలేశారు. చంద్రబాబు కాన్వాయ్ తెలంగాణా బోర్డర్ ఏపీలో ప్రవేశించిన క్రమంలో స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు సామాజిక దూరం, మాస్క్ లు ధరించడం చేయలేదు.కంచికచర్ల, నందిగామ నియోజకవర్గ కేంద్రాలలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ లు శ్రీరామ్ రాజగోపాల్, తంగిరాల సౌమ్య వందల సంఖ్యలో కార్యకర్తలతో వచ్చి బాబు, లోకేష్ లకు స్వాగతం పలికారు. ఎక్కడా సామాజిక దూరం కనిపించలేదు.

అక్కడున్న పోలీసులు వారిస్తున్నా తెలుగు తమ్ముళ్లు పట్టించుకోకుండా బాబుకు స్వాగతం చెప్పేందుకు ఎగబడుతున్నారు. ఈ వ్యవహారం చంద్రబాబు వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఇటువంటి పరిస్థితి ఉంటే తాము కరోనా భారిన పడక తప్పదని ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులే రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణమంటూ విమర్శించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తన పర్యటనలో చోటు చేసుకున్న సంఘటనకు ఎం సమాధానం చెబుతారో మరి. వైసీపీ నాయకులకు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి సమాధానం చెప్పేందుకు మంచి అవకాశం దొరికిందని ఉత్సహంగా ఉన్నారు.