
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాల ఆలయంలో స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం విశేషంగా పూజలు జరిపారు. ఆలయ మండపంలో 108 కలశాలలకు శాస్త్రోక్తంగా శతఘటాభిషేక పూజలు చేశారు. అదే విధంగా నిత్య పూజలు కూడా ఘనంగా నిర్వహించారు.
ఈ శతఘటాభిషేకంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధాన అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు, పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు 6వేల వరకు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Also Read : అన్నదాతలకు తీపికబురు చెప్పిన మోడీ సర్కార్