https://oktelugu.com/

దేత్తడి హారిక ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో స్టెప్పులేసిన గంగవ్వ

తెలుగు రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా దూసుకెళుతోంది. గత మూడు సీజన్లలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ నిర్వాహాకులు ‘బిగ్ బాస్-4’ సీజన్ ను ప్రారంభించారు. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్-4 ప్రేక్షకులను ఎంటటైన్మెంట్ చేస్తోంది. బిగ్ బాస్-4లో పెద్ద వయస్కురాలిగా పాల్గొన్న గంగవ్వ అందరినీ ఎంటట్మెంట్ చేస్తుండటం గమనార్హం. Also Read : ‘ర‌కుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి  !    రెండోవారంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2020 / 12:19 PM IST

    gangavva

    Follow us on

    తెలుగు రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా దూసుకెళుతోంది. గత మూడు సీజన్లలో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ నిర్వాహాకులు ‘బిగ్ బాస్-4’ సీజన్ ను ప్రారంభించారు. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్-4 ప్రేక్షకులను ఎంటటైన్మెంట్ చేస్తోంది. బిగ్ బాస్-4లో పెద్ద వయస్కురాలిగా పాల్గొన్న గంగవ్వ అందరినీ ఎంటట్మెంట్ చేస్తుండటం గమనార్హం.

    Also Read : ‘ర‌కుల్ ప్రీత్ సింగ్’.. మళ్ళీ అడవిలోకి  !   

    రెండోవారంలో బిగ్ బాగ్ సడెన్ ట్వీస్ట్ ఇచ్చారు. ప్రతీవారం ఒకరిని ఎలిమినేట్ చేస్తుండగా రెండోవారంలో ఇద్దరిని బిగ్ బాస్ హౌజ్ నుంచి పంపించనున్నట్లు నాగార్జున ప్రకటించాడు. దీంతో కంటెస్టుల్లో టెన్షన్ నెలకొంది. మొదటివారంలో దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే గంగవ్వ అంతకముందే తనను బిగ్ బాస్ నుంచి పంపించాలంటూ కోరడంతో ఆమెను ఎలిమినేట్ చేస్తారనే ప్రచారం జరిగింది. రెండో ఎలిమినేటర్ గా కరాటే కల్యాణి బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోయింది.

    శనివారం నాడే హోస్టు నాగార్జున బిగ్ బాస్ హౌజ్ లో గంగవ్వ కొనసాగుతుందని స్పష్టం చేయడంతో ఆమె అభిమానులకు కొంత ఊరటనిచ్చింది. ఇక ఆదివారం షోలో మరొకరిని ఎలిమినేట్ చేయనున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. దెత్తడి హారికను ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించి చివరికీ తుచ్ అని చెప్పాడు. దీంతో దెత్తడి హారిక బిగ్ బాసులో తిరిగి  కొనసాగుతోంది. అయితే ఆదివారం నాటి షో గంగవ్వ కామెడియన్ సాయితో స్పెప్పులు వేసి అలరించింది.

    బాలయ్య సినిమాలోని ‘పైసా వసూల్’ సాంగ్ కు మడత స్టెప్పులేసి ఆకట్టుకుంది. నాగర్జున ఇచ్చిన ‘బోన్ టాస్కు’లో గంగవ్వే బోన్ దక్కించుకొని అందరికీ షాకిచ్చింది. లేటు వయస్సులోనూ గంగవ్వ బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తుండటంతో ఓటింగులోనూ ఆమె ముందంజలో నిలుస్తుంది.

    Also Read : కృతిశెట్టికి బర్తేడ్ గిప్ట్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీమ్