మహారాష్ట్రలో మంగళవారం ఉదయం భూప్రకంపణాలు చోటు చేసుకున్నాయి. పార్ఘర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 3 గంటలకు భూమి కంపించగా రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) తెలిపింది. ఈనెల 9న ఇదే ప్రాంతంలో భూమి కంపించడంతో అప్పుడు 3.2 తీవ్రత నమోదైందని ఎన్‌సీఎస్ తెలిపింది. భూ ప్రకంపణలు రావడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్లలోనుంచి బయటకు వచ్చారు.
Also Read: రైతుల శ్రేయస్సు కోసమే ఆ బిల్లులు -మోదీ