కరోనా టెస్టులు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉంది. కరోనా కట్టడికి ఏపీలో అక్కడి సీఎం జగన్ ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయినా.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఆరోపణలు మానడం లేదు. కరోనా పెషెంట్లను పట్టించుకోవడం లేదని.. వారికి వైద్యం అందించడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని.. కొన్నాళ్లుగా దుమారం రేపుతున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లోనూ సరైన ఆహారం పెట్టడం లేదని ఆరోపించారు. కేంద్ర నుంచి వచ్చిన కోట్లాది రూపాయలను కూడా జగన్ తన రాష్ట్ర స్కీంలకు మలుచుకున్నారని చెప్పుకొస్తున్నారు.
Also Read: 2019లో టీడీపీకి పట్టిన గతే 2024లో వైసీపీకి పడుతుందా…?
దీనిపైనే రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఆరోపణలు చేశారు. కరోనా కట్టడికి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని.. వాటిని జగన్ విచ్చలవిడిగా సొంతానికి ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీకి కేటాయించిన మొత్తం వివరాలను రాజ్యసభ సాక్షిగా ప్రకటించింది.ఏపీలో కరోనా కట్టడికి సుమారుగా 200 కోట్ల రూపాయలను ఇచ్చినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే.. తెలంగాణకు రూ.270 కోట్లను ఇచ్చినట్లు చెప్పారు.
కేంద్ర మంత్రి లెక్కలతో కేంద్రం నుంచి ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో వెల్లడైంది. దీంతో టీడీపీ నేతలకు షాక్ తగిలింది. ఇప్పటివరకు వేల కోట్లు వచ్చాయని చెప్పుకొస్తున్న టీడీపీ .. ఈ లెక్కలను చూసి నోర్లు మూసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రం ఏదో ఇచ్చిందని చెబుతూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అసలు విషయం తెలిసిపోవడంతో మాట్లాడడం మానేశారు.
Also Read: ఆంధ్ర రాజకీయాల్లో బిజెపి ఎంటర్ అయినట్లే
ఈ పరిణామం కాస్త తెలుగుదేశం పార్టీ నేతలకు ఇబ్బందిలా మారింది. ఇన్నాళ్లు చేసిన ఆరోపణలతో పార్టీ మైలేజ్ పోయినట్లుగా అయిందని టీడీపీ నేతలే వాపోతున్నారు. కరోనా విషయంలో ఇక మౌనమే బెటర్ అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.