క్లోరోక్విన్ టాబ్లెట్లు వల్ల ఇంత ప్రమాదమా!

కరోనా వైరస్ ‌కు ఇప్పటివరకు వాక్సిన్‌ లేదు. కొన్ని పరిశోధనల తర్వాత కరోనా సోకిన వ్యక్తికి చికిత్సలో భాగంగా ఇస్తున్న మలేరియా మందు (హైడ్రాక్సీ క్లోరోక్విన్)‌ టాబ్లెట్‌ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దింతో అత్యవసర పరిస్థితుల్లో అవసరం లేకున్నా పలువురు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను వాడటాన్ని డాక్టర్లు తప్పుపడుతున్నారు. వైద్యుడు సిఫార్సు చేయకుండా నేరుగా మలేరియా మందు (హైడ్రాక్సీ క్లోరోక్విన్‌) టాబ్లెట్లను వాడితే గుండె రిథమ్, పంపింగ్‌ లో తేడా వచ్చి, ఆకస్మిక గుండెపోటుకు దారితీసే ప్రమాదం […]

Written By: Neelambaram, Updated On : April 13, 2020 4:01 pm
Follow us on

కరోనా వైరస్ ‌కు ఇప్పటివరకు వాక్సిన్‌ లేదు. కొన్ని పరిశోధనల తర్వాత కరోనా సోకిన వ్యక్తికి చికిత్సలో భాగంగా ఇస్తున్న మలేరియా మందు (హైడ్రాక్సీ క్లోరోక్విన్)‌ టాబ్లెట్‌ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దింతో అత్యవసర పరిస్థితుల్లో అవసరం లేకున్నా పలువురు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను వాడటాన్ని డాక్టర్లు తప్పుపడుతున్నారు. వైద్యుడు సిఫార్సు చేయకుండా నేరుగా మలేరియా మందు (హైడ్రాక్సీ క్లోరోక్విన్‌) టాబ్లెట్లను వాడితే గుండె రిథమ్, పంపింగ్‌ లో తేడా వచ్చి, ఆకస్మిక గుండెపోటుకు దారితీసే ప్రమాదం లేకపోలేదు’ అని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) కార్డియో థొరాసిక్‌ సర్జన్, ప్రొఫెసర్‌ ఆర్వీకుమార్‌ స్పష్టం చేశారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో అవసరం లేకున్నా పలువురు క్లోరోక్విన్‌ కొనుగోలు చేస్తూ పరోక్షంగా కృత్రిమ కొరతకు కారణమవుతున్నారని ఆయన తెలిపారు.

వైద్యుల సిఫార్సు లేకుండా క్లోరోక్విన్‌ వాడితే గుండె రిథమ్‌ సహా పంపింగ్‌ లోనూ తేడా వస్తుంది. కంటి రెటీనా దెబ్బతింటుంది. కరోనా పాజిటివ్‌ బాధితులకు కూడా ఈసీజీతీసి, వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతుంటారు. హైరిస్క్‌ జోన్‌ లో ఉన్న వారు కాకుండా ఇతరులు కూడా ఈ మందులు ఇష్టానుసారం వాడుతున్నారు. ఇలా వాడటం వల్ల గుండె లయ తప్పుతుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణలో తేడాలు ఏర్పడతాయి. ఫలితంగా హార్ట్‌ఎటాక్‌ వచ్చే ప్రమాదం లేకపోలేదు.

నిజానికి పాజిటివ్‌ బాధితులకు అజిత్రోమైసిన్‌ కాంబినేషన్ ‌లో ఈ మందులు వాడుతున్నారు. వారి నుంచి వారికి సన్నిహితంగా మెలిగిన వారికి కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది కాబట్టి, ఇదే మందును వారి కుటుంబసభ్యులు, ఇతర సన్నిహితులకు కూడా సిఫార్సు చేస్తున్నారు. అంతేకాదు వైద్య సేవలందించే వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, పారమెడికల్‌ స్టాఫ్‌ సహా కేసులను ట్రేస్‌ చేసేందుకు వెళ్లే సర్వేలెన్స్‌ ఆఫీసర్లకు, శానిటైజ్‌ చేసే పారిశుద్ధ్య కార్మికులకు వైరస్‌ సోకవచ్చు. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఈ హైరిస్క్‌ కేటగిరిలో పనిచేసే వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సిఫార్సు చేస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలోనే దీనిని వాడాలి. కానీ కొంతమంది ఎలాంటి కాంటాక్ట్‌ హిస్టరీ లేకపోయినా ముందస్తుగా ఈ టాబ్లెట్లను కొని వాడుతున్నారు. రోగుల బలహీన%