
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి ప్రజలను బెంబేలెత్తిస్తుంది. దీంతో ఆయా దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. భారత్ లోనూ కరోనా ఎంట్రీతో 21రోజుల లాక్డౌన్ అమలు చేస్తున్నారు. రేపటితో ఈ లాక్డౌన్ గడువు ముగియనుండగా కేంద్రం మరో రెండువారాలు పొడగించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. లాక్డౌన్ ఇంటికి పరిమితమైన ప్రజలు సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది కాలక్షేపం కోసం పోర్న్ వీడియోలను చూస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.
ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ ‘పోర్న్ హబ్’ తాజాగా విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ వీక్షించే వారిసంఖ్య పెరిగినట్లు ప్రకటించింది. లాక్డౌన్ వేళ ప్రజలు ఇళ్లకే పరిమితం అవడం, సోషల్ డిస్టెన్స్ వంటివి పాటించడం వల్ల ఎక్కువ మంది పోర్న్ సైట్ చూసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పోర్న్ ఎక్కువగా చూస్తున్న దేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉన్నట్లు ‘పోర్న్ హబ్’ ప్రకటించడం గమనార్హం.
భారత్ లో లాక్డౌన్ తర్వాత ఏకంగా 60శాతం వ్యూయర్స్ పెరిగినట్లు ప్రకటించింది. ప్రజలు అందరూ ఖాళీగా ఇంట్లోనే ఉండటం వల్లనే ఈ వీడియోలు చూస్తూ ఆనందిస్తున్నారని ఈ నివేదికలో ప్రకటించడం విశేషం. అదేవిధంగా కండోమ్స్ కు కూడా దేశంలో బాగా గిరికి పెరిగిందని వెల్లడించింది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఓవైపు శాయశక్తులా కృషి చేస్తుంటే మరోవైపు అధికశాతం ప్రజలు తమ శక్తినంతా ‘పోర్న్’ సైట్లకు ధారబోయడం విచిత్రంగా మారింది.