
ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా ప్రారంభమైన రాజధాని మంట ఇంకా రగులుతూనే ఉంది. ఈ విషయాన్ని గూర్చి కొన్ని టీవీ చాన్నాళ్లు, పత్రికలు, ఎంతగా ప్రచారం చేసినా.. అలాగే టీడీపీ నేతలు, అమరావతి రైతులు ఎంతగోల పెట్టినా.. రాజధాని సమస్య అమరావతిని దాటలేదు అనేది వాస్తవం. నిజానికి “రాష్ట్ర రాజధాని” సమస్య కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు అయినా సరే అమరావతి మినహా ఏ జిల్లా ప్రజలు కూడా స్పందించక పోవడం గమనార్హం.
రాజధాని మార్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటీ అంటనట్టే ఉన్నారు అనేది వాస్తవం. మొన్నొక సారి రైతుల దగ్గరికి వెళ్లిన పవన్ మరళా నోరు మెదపలేదు. అయితే ప్రస్తుతం ఆయన మరోసారి రైతుల తరుపున జగన్ సర్కారుపై పోరాటానికి సిద్ధమౌతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి పంట పండే పొలాలను ఇచ్చిన తర్వాత వాటిని బీడు భూములుగా మార్చారు, కొన్ని చోట్ల రోడ్లు వేశారు, ఎవరి భూమి ఎక్కడ ఉందొ కూడా తెలియని పరిస్థితి. కావున రైతులకు న్యాయం జరగాలని అని జనసేనాని రైతుల తరుపున పోరాటంలోకి దిగుతున్నాడు.
“ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు వైసీపీ పార్టీ చేస్తోందని, జగన్మోహన్ రెడ్డి దిగి రావాలని, రైతుల మధ్యకు వెళ్ళాలని వారి సమస్యలను తెలుసుకోవాలి.దీనిపై ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి అని జనసేన డిమాండ్ చేస్తుంది. జగన్ కి అక్కడ ఆస్తులు లేవని రాజధానిని మారుస్తున్నారా..? లేక చంద్రబాబుకి ఆస్తులు పోతాయని మార్చద్దంటున్నాడా..? అనేది అప్రస్తుతం కానీ రైతుల అస్థిత్వాన్ని కాపాడటానికి రాజధానిని మార్చద్దంటున్నారు పవన్ కళ్యాణ్.
జనసేన పార్టీని, జనసైనికులని అష్ట దిగ్భందన దాడి చేస్తూ.. జగన సర్కార్ ఇప్పటివరకు బాగానే నిలువరించింది అనేది నిజం. కానీ వ్యూహాలకి ప్రతి వ్యూహాలు రచిస్తూ,అన్నిటినీ ఎదుర్కుంటూ,ఎదురునిలవడం ఎలా అనేదే.. జనసేనలో ఉన్న అతిపెద్ద సమస్య. ఈ సమస్యని ఎదిరించి రాజధాని విషయం పై జనసేన ఎంతవరకు విజయం సాధిస్తుందో.. వేచిచూడాలి..