
చంద్రబాబు నాయుడు పై ఆర్ధిక అక్రమాల వార్తలు ఇటీవల జోరందుకున్నాయి. అందులో మొదటిది ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) అధికారిక ప్రకటన. సీబీడీటీ ఎక్కడా వ్యక్తి పేరు చెప్పకపోయినా ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీబీడీటీ అధికారిక ప్రకటన లో ఇటీవల ఓ ప్రముఖ కాంట్రాక్టర్ సంస్థపై దాడుల్లో 150 కోట్ల రూపాయలు ఓ రాజకీయ ప్రముఖుడికి ముడుపులు చెల్లించినట్లుగా ఆధారాలు దొరికినట్లు ప్రకటించారు. సంస్థ నవయుగ అని , రాజకీయ ప్రముఖుడు చంద్రబాబని అందరూ గుస గుసలాడుకుంటున్నారు. ఈ వార్త ల్లోని వేడి చల్లారక ముందే ఇంకో వార్త ఈ రోజు ప్రముఖంగా ముందుకొచ్చింది. అది 14 ఏళ్ల క్రితం నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. లక్ష్మీ పార్వతి 2005 లో చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నాడని అవినీతి నిరోధక శాఖ కు కంప్లెయింట్ ఇవ్వటం జరిగింది. దానిపై అవినీతి నిరోధక శాఖ విచారణ జరపగా ముందే చంద్రబాబు నాయుడు హై కోర్టు కెళ్ళి విచారణ జరపకుండా స్టే తీసుకొచ్చుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఆ స్టే అలానే కొనసాగుతుంది. ఇటీవల సుప్రీం కోర్టు సివిల్, క్రిమినల్ కేసుల్లో కూడా ఆరు నెలలకు మించి ఎటువంటి స్టే కోర్టు ఇవ్వరాదని చెప్పటంతో ఈ కేసు విచారణకు నోచుకుంది. వచ్చే సోమవారం అంటే 25వ తేదీ కేసు విచారణకు రానుంది. ఆమేరకు లక్ష్మీపార్వతి కి నోటీసులు పంపించారు. ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు సంభాషణ లపై విచారణ స్వీకరించింది. ఇప్పుడు జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కౌంట్ డౌన్ మొదలయిందని జనం అనుకుంటున్నారు.
తన గ్రహబలం బాగాలేదని , తన అవినీతి చర్యలు బహిర్గతం అయ్యే రోజులు దగ్గరపడ్డాయని, కష్టాలు ఎదుర్కోకతప్పదని తెలిసే తిరిగి మోడీకి, అమిత్ షా కి దగ్గర కావటానికి పడరాని పాట్లు పడటం మనం చూస్తున్నాం. నాగపూర్ వెళ్లి రహస్యంగా ఆర్ఎస్ఎస్ ని కలవటం, మోడీని వ్యతిరేకించి తప్పుచేశానని వైజాగ్ లో ప్రకటించటం, తన విశ్వాస పాత్ర ఎంపీ లను బీజేపీ లోకి పంపించటం లాంటి చర్యలన్నీ ఇందులో భాగమే. అయితే ఇప్పటివరకు మోడీ, అమిత్ షా చంద్రబాబు నాయుడు ని కనుకరించినట్లు ఎక్కడా సూచనలు లేవు. అది చంద్రబాబు నాయుడు కి కంటి కునుపు లేకుండా చేస్తుంది. ముందు ముందు జగన్ లాగానే తాను కూడా చిప్పకూడు తినాల్సివస్తుందనే బాధ, భయం తనని వెంటాడుతున్నాయని ఈ లోపే మోడీ కరుణిస్తాడేమోనని ఆశతో ఎదురుచూపులు చూస్తున్నాడట. అదే సమయంలో న్యాయవ్యవస్థలో తనకున్న పలుకుబడి తనను కాపాడుతుందని ఏడుకొండలవాడిని రోజూ తలుచుకుంటున్నాడని తెలుస్తుంది.
జగన్ పార్టీలో ముఖ్యులు చెప్పేదాన్నిబట్టి ఇప్పటికి బయటికొచ్చింది సముద్రంలో రెట్టలాంటిదని ముందు ముందు ఇంకా ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకోబోతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పై సానుభూతి అట్టడుగు స్థాయిలో ఉండటం కూడా తన అనుచరుల్లో కలవరానికి గురిచేస్తుంది. తన కుప్పిగంతులు,యు టర్న్ లు ప్రజల్లో తనపై క్రెడిబిలిటీ ని పూర్తిగా జీరో స్థాయికి తీసుకెళ్లాయి. తనను ఆకాశానికెత్తే మీడియా, తను ఏమిచేసినా మద్దతుగా నిలిచే తన సామాజికవర్గం తప్ప అన్ని సెక్షన్లలో విశ్వసనీయతను కోల్పోయాడు. ఎన్టీఆర్ పార్టీ ని స్థాపించినప్పటి నుంచి వెన్నంటి వున్నబీసీ సామజిక వర్గం మొట్టమొదటిసారి తెలుగు దేశానికి దూరం కావటం కూడా చంద్రబాబు పుణ్యమే. తప్పుడు వ్యూహాలు, ఎత్తుగడలతో వాళ్లలో విశ్వసనీయతను కోల్పోయాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఒంటరి వాడయ్యాడు. పార్టీ లోని ద్వితీయ, తృతీయ నాయకత్వం కూడా మొట్టమొదటిసారి తన నాయకత్వంపై విమర్శలు చేయటం మొదలయ్యింది. అయితే అది ప్రస్తుతం నాలుగు గోడల మధ్యనే వుంది. త్వరలో పూర్తిగా బట్టబయలయ్యే అవకాశముందని ఊహిస్తున్నారు. పార్టీలోని కాపు సామజిక వర్గ నేతలంతా త్వరలో బీజేపీ లోకి మూకుమ్మడి వలస చేస్తారని అనుకుంటున్నారు. ఇంతమంది ని దూరం చేసుకోవటానికి కారణం తనపై విశ్వసనీయత లేకపోవటమేనని భావిస్తున్నారు. మోడీ ప్రసన్నుడు కాకపోయేటట్లయితే త్వరలో అవినీతి చిట్టాలు, సాక్ష్యాధారాలు తో సహా దర్యాప్తు సంస్థలకు చిక్కటం ఖాయమని అనుకుంటున్నారు. ఈ పరిణామం మోడీకి అనుకూలంగా ఉందని అనుకుంటున్నారు. అటు జగన్ మోహన్ రెడ్డి , ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ మోడీ ప్రసన్నం కోసం తంటాలు పడుతుంటే మోడీకి అంతకంటే ఆనందమేముంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం చంద్రబాబు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లేనని త్వరలో జైలు కెళ్ళటం ఖాయమని వైస్సార్సీపీ నాయకులు ఆంతరంగిక చర్చల్లో బల్లగుద్ది వాదిస్తున్నారు. పాపం చంద్రబాబు ఒకనాడు సంస్కరణలకు ఆద్యుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఇప్పుడు జైలు ఊసలు లెక్కించాల్సి వస్తుందేమోనని అనుకోవటం బాధాకరం. విధి వైపరీత్యం . చిదంబరం లాంటి ‘మేధావి’ , మాజీ హోం మంత్రికే తప్పనప్పుడు అందరిలోకి సీనియర్ నని చెప్పుకున్నంత మాత్రాన చేసిన పాపాలు వూరికే పోవు కదా. రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుందో వారు చెప్పగలరు?