
వైఎస్ వివేకానంద హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేక కుమార్తె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు కొత్తగా నాలుగో పిటిషన్ వైఎస్ వివేకా కుమార్తె సునీతమ్మ దాఖలు చేశారు. అయితే అన్ని పిటిషన్లను ధర్మాసనం ఇవాళ విచారించనుంది.
Read More: ఏపీలో 3 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం