
ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం రాజధాని సెగతో అట్టుడుకి పోతుంటే..మరోవైపు ఒక కొత్త చర్చ నడుస్తుంది, అదేంటంటే ఒకవేళ నేరం రుజువయ్యి జగన్ జైలుకి వెళ్లాల్సివస్తే తదుపరి సీఎం ఎవరు అనే చర్చ జనాల్లో విస్తృతంగా జరుగుతుంది.
జగన్ అక్రమ ఆస్తుల కేసు ఎప్పటినుంచో విచారణలో ఉంది. కొన్ని సంవత్సరాలుగా వాదోపవాదానలతో కేసును నెట్టుకొస్తున్నాడు. జగన్ కి వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ఇప్పటికే సిబిఐ ధర్మాసనం కన్నెర్ర చేసింది. కచ్చితంగా విచారణకి వచ్చి సహకరించాల్సిందిగా ఆదేశించింది. ఎందుకో ఇంకొన్ని రోజుల్లో దీనికి ముగింపు పడుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి.
చట్టానికి ఎవరు చుట్టాలు కారు, అందరూ సమానమే. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక సాధారణ పౌరుడైన నేరం రుజువైతే జైలుకి వెళ్లాల్సిందే. లాలూ ప్రసాద్ యాదవ్,
చిదంబరం, జయలలిత లాంటి పెద్ద వాళ్ళే వెళ్లారు. మరి అలాంటప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న జగన్ కి ఇది తేరుకోలేని దెబ్బె. పది సంవత్సరాలు శ్రమించి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి, కనీసం పట్టుమని పది నెలలుకూడా కాకముందే జైలుకి వెళ్లాల్సివస్తే ఇంకేమైనా ఉందా… సరే కాలం కలిసిరాక వెళ్తే… మరి అప్పుడు పార్టీని బలంగా నిలబెట్టేది ఎవరు..? ఎవరిని నమ్మి పార్టీ బాధ్యతని అప్పగించాలి..?
అందరిలో ఉన్న పెద్ద ప్రశ్న సీఎం స్థానాన్ని ఇంట్లో వాళ్ళకి ఇస్తాడా లేక పార్టీలో పెద్దలైన వారికి ఇస్తాడా అని. ఇంట్లో వాళ్ళకే ఇచ్చే ఉదేశ్యం ఉంటె విజయమ్మకే ఇవ్వాలి, అప్పుడే పార్టీలో ఎలాంటి కుమ్ములాటలు రాకుండా ఉంటాయి.
ఒకవేళ ఆ సమయం వచ్చేసరికి ఎవరైనా పెద్ద తలకాయకి సీఎం కుర్చీ మీద మోజుపుడితే మాత్రం అది అంతర్గత కుమ్ములాటలకి దారితీస్తుంది. 151 సీట్లతో బలంగా ఉన్న పార్టీ వర్గాల వారీగా విడిపోతుంది. అధికారంలో ఉన్న పార్టీకి సరైన నాయకుడు లేకపోతే అ పార్టీ విచ్చిన్నం అయిపోతుంది.
పార్టీని బలంగా నిలబెట్టాలంటే జగన్ తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకొని పార్టీని నిలబెడతాడో వేచిచూడాలి. ఏమి చేసినా సరే క్యాడర్ కి నమ్మకం పోకుండా ఉండాలి, అప్పుడే పార్టీ అనేది కూలి పోకుండా ఉంటుంది.