https://oktelugu.com/

రోజాపై హైపర్ ఆది అసభ్యకర వ్యాఖ్యలు

జబర్దస్త్ కామెడీ షోలో బోలెడంత ప్రజాదరణ హైపర్ ఆది స్కిట్లకు వస్తుంది. స్కిట్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రాసలు, పంచ్ డైలాగ్స్ , కొంటె మాటలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. గురువారం ప్రసారమైన జబర్దస్త్ షోలో భాగంగా హైపర్ ఆది తన స్థాయికి మించి అతి చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ పాత్రతో హైపర్ ఆది తెర ముందుకు వచ్చాడు. స్కిట్‌లో […]

Written By: , Updated On : February 8, 2020 / 10:43 AM IST
Follow us on

జబర్దస్త్ కామెడీ షోలో బోలెడంత ప్రజాదరణ హైపర్ ఆది స్కిట్లకు వస్తుంది. స్కిట్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రాసలు, పంచ్ డైలాగ్స్ , కొంటె మాటలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. గురువారం ప్రసారమైన జబర్దస్త్ షోలో భాగంగా హైపర్ ఆది తన స్థాయికి మించి అతి చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ పాత్రతో హైపర్ ఆది తెర ముందుకు వచ్చాడు. స్కిట్‌లో భాగంగా.. తన భార్యగా నటించిన బిగ్‌బాస్ ఫేమ్ రోహిణి, మరదలిగా శాంతి స్వరూప్ నటించాడు. అయితే, రాఘవేంద్రరావు నన్ను చూసుంటే నా బొడ్డు మీద ఏ పండుతో కొట్టేవారో తెలుసా అని శాంతి స్వరూప్ అనగా, పండులతో, పువ్వులతో కొట్టడానికి నువ్వేమన్నా రోజా గారివా అంటూ ఆది వ్యాఖ్యానించాడు.

ఆది అలా అనడంతో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతడేంటి ఇలా అంటున్నాడని ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. వెంటనే.. ఆమె అందగత్తె కాబట్టి రాఘవేంద్రరావు అలా చేశారంటూ ఆది తన స్కిట్‌ను కొనసాగించాడు. అయితే, హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్జి హోదాలో ఉన్న వ్యక్తిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తావా? అంటూ మండిపడ్డారు. మంచి హోదాలో ఉన్న వ్యక్తి గురించి అలా ఎలా వ్యాఖ్యానిస్తాడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.