Homeజాతీయ వార్తలుఆధార్‌ కార్డులో మార్పులుపై కొత్త రూల్స్!

ఆధార్‌ కార్డులో మార్పులుపై కొత్త రూల్స్!

  ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులపై భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(ఉడాయ్‌) కొత్తగా ఆంక్షలు తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా ఇకపై ఎన్ని సార్లు అంటే అన్నిసార్లు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోడానికి కుదరదు. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఆధార్‌లో పుట్టినతేదీని కేవలం ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుంది.   ఆధార్‌ కార్డు జారీ చేసిన సమయంలో పేరు, పుట్టినతేదీ ఇలా దేనిలోనైనా పొరబాట్లు ఉంటే సరిదిద్దుకోడానికి వీలుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే వీలుంది. అయితే ఆధార్‌ […]

 

ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులపై భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(ఉడాయ్‌) కొత్తగా ఆంక్షలు తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా ఇకపై ఎన్ని సార్లు అంటే అన్నిసార్లు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోడానికి కుదరదు. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఆధార్‌లో పుట్టినతేదీని కేవలం ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుంది.

 

ఆధార్‌ కార్డు జారీ చేసిన సమయంలో పేరు, పుట్టినతేదీ ఇలా దేనిలోనైనా పొరబాట్లు ఉంటే సరిదిద్దుకోడానికి వీలుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే వీలుంది. అయితే ఆధార్‌ అప్‌డేట్‌ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులపై ఉడాయ్‌ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా పేరు, పుట్టినతేదీని ఇష్టానుసారంగా మార్చుకునే వీలు లేకుండా పరిమితులు విధించింది.

 

ఆధార్‌ కార్డులో మార్పులుపై కొత్త రూల్స్ ఇవే..

  • పుట్టిన తేదీ, లింగం విషయంలో తప్పులుంటే: కేవలం ఒక్కసారే మార్చుకోవాలి. మూడేళ్లు తక్కువ గానీ, ఎక్కువ గానీ మార్చుకునేందుకు మాత్రమే అవకాశముంటుంది. పుట్టినతేదీ మార్చుకోడానికి కచ్చితంగా ధ్రువపత్రం ఉండాల్సిందే.
  • పేరులో తప్పులుంటే: ఇకపై కేవలం రెండు సార్లు మాత్రమే మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది.
  • నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ సార్లు కార్డుదారు తన పేరు, పుట్టినతేదీ, లింగ మార్పులు చేసుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి దగ్గర్లోని ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మార్పులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఇ-మెయిల్‌ లేదా పోస్టు ద్వారా పంపాలి. సంబంధిత ధ్రువపత్రాలతో పాటు ఎందుకు తమ అభ్యర్థనను అంగీకరించాలో కూడా వివరించాల్సి ఉంటుంది.
  • ప్రాంతీయ కార్యాలయం కార్డుదారు నుంచి అదనపు సమాచారం కోరే అవకాశం కూడా ఉంది. అవసరమైతే క్షేత్ర స్థాయి వెరిఫికేషన్‌ కూడా ఉంటుంది. మార్పు కోసం వచ్చిన అభ్యర్థన నిజమైందేనని నిర్ధరణకు వస్తే అప్పుడు కార్డును అప్‌డేట్‌ చేస్తారు.
admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper