Rashmika: చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్‌గా మారిన హీరోయిన్ రష్మిక. కొంత మంది లక్కీ బ్యూటీ అని కూడా అంటారు. ఛలో సినిమా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు క్యూకట్టాయి. అప్పటినుంచే తెలుగు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవందం, డియర్ కామ్రెండ్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకుని.. ఆతర్వాత స్టార్ హీరోలతో జతకట్టింది.
మహేశ్‌బాబు నటింటిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్గా కనిపించిన రష్మిక.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్పలో నటిస్తోంది. ఇందులో బన్నీకి జోడీగా కనిపించనుంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా.. రష్మిక పల్లెటూరి యువతిగా డీగ్లామర్ లుక్‌లో దర్శనమివ్వనుంది. ఈ సినిమా డిసెంబరు 17న విడుదలకు సిద్ధమైంది.
Also Read: భర్త వదిలేశాక, పాత బంధంలోకి స్టార్ హీరోయిన్ !
కాగా, రష్మిక తరచూ సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలనోనే తను నటించిన పుష్ప రేపు విడుదల కానున్న సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామి సామి పాటకు తను ఎంతో కష్టపడినట్లు తెలిపింది. అది చూసి అందరూ ప్రశంసిస్తే చాలంటూ చెప్పిన ఓ వీడియోను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోపైన ఓ నెటిజన్ స్పందిస్తూ.. అసలు నిన్ను హీరోయిన్గా తీసుకోకుండా ఉండాల్సింది.. ఇది చాలా ఓవర్ అనిపించట్లేదా?.. అని కామెంట్ చేశాడు.. దీనిపి స్పందించిన రష్మిక.. యాక్టింగో.. ఓవరాక్టింగో.. నేను జీవింతో ఏదో ఒకటి సాధించా.. నువ్వు ఏం చేశావ్ నాన్నా.. అంటూ దిమ్మతిరిగే కౌంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Also Read: పుష్ప లవ్ ట్రాక్ పై క్రేజీ అప్ డేట్.. ఇష్టం లేని పెళ్లి అట !
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More