Yogi bans caste-based rallies : రాజకీయాల నాయకులు చిక్కరు దొరకరు. కానీ యూపీ సీఎం యోగి భిన్నంగా కనిపిస్తున్నారు. నిన్న ఉత్తరప్రదేశ్ లో కుల ప్రదర్శనలపై సీఎం యోగి నిషేధం విధించారు.కుల పట్టింపులు లేని సమాజం కావాలని యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్టేజీల మీద మాటలు చెప్పి ఆచరించని నేతలు ఎందరో ఉన్నారు. కుల మీటింగులకు వెళ్లే సీఎంలున్నారు. కానీ యూపీలో కులం ప్రస్తావన రాకుండా యోగి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది.
అలహాబాద్ కోర్టు ఒక తీర్పునిచ్చింది. నేరం చేసిన వారిపై పెట్టే ఎఫ్.ఐఆర్ లో కుల ప్రస్తావన తీసుకురావద్దని తీర్పునిచ్చింది. ఎటువంటి వాహనాలపై కులం పేరు స్టిక్కర్లు వేయవద్దు. సైన్ బోర్డులపై, కాలనీలకు కులం పేర్లు పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కులం పోవాలని.. కుల వివక్ష పోవాలని సుందరయ్యా, అంబేద్కర్ లాంటి ఎంతో మంది చెప్పినా ఇప్పటికీ కుల వివక్ష పోలేదు. రాజకీయ నాయకులు ఈ స్టాండ్ తీసుకోవడం చిన్న విషయం కాదు.
కులం పేరుతో ప్రదర్శనలను నిషేధించిన యోగి ప్రభుత్వం తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.