Bengaluru techie Tanush Sharanarthi: టాలెంట్ ఎవడి సొంతం కాదు. ప్రతీ మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తించి వెలికి తీసి ప్రదర్శించిననాడే అది సమాజానికి తెలుస్తుంది. ఇక ప్రతిభను దాచాలని చూసినా దాగదు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వీటిని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. ఇందుకు బెంగళూరుకు చెందిన టెకీ తాజా ఉదాహరణ. హెచ్–1బీ వీసాల జారీ నిబంధనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేశాడు. ఫీజు భారీగా పెంచాడు. దీంతో భారతీయుల అమెరికా కల కష్టతరంగా మారింది. కానీ, బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తనూష్ శరణార్థి ఈ సవాళ్లను అధిగమించి హెచ్–1బీ వీసా(ఐన్‌స్టీన్ వీసా) సాధించాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి, ఐబీఎం కాలిఫోర్నియాలో పని చేస్తున్నాడు.
హెచ్–1బీ వైఫల్యాల నేపథ్యం..
హెచ్–1బీ వీసా, అమెరికాలో నిపుణుల ప్రవేశానికి ప్రధాన మార్గంగా ఉంటుంది, కానీ దాని లాటరీ విధానం వల్ల లక్షలాది అభ్యర్థులు ఏటా నిరాశకు గురవుతున్నారు. తనూష్ శరణార్థి మూడుసార్లు ప్రయత్నించినా లాటరీ తగలలేదు. అయినా వెనుకడుగు వేయలేదు. బెంగళూరు నుంచి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో మాస్టర్స్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ –ఏఐ) పూర్తి చేసిన తనూష్, కింబర్లీ–క్లార్క్ వంటి సంస్థల్లో పని చేసి అనుభవం సంపాదించారు. ఈ వైఫల్యాలు ఏఐ రంగంలో మరింత రాణించేలా చేశాయి. దీంతో హెచ్–1బీ వీసా సాధనకు మార్గం సుగమమైంది.
అసాధారణ ప్రతిభకు ప్రత్యేక మార్గం..
హెచ్–1బీ వీసా ‘ఐన్‌స్టీన్ వీసా‘గా పిలవబడుతుంది, ఎందుకంటే ఇది ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి అసాధారణ ప్రతిభాధారులకు మార్గదర్శకంగా రూపొందించబడింది. ఈ వీసా విజ్ఞానం, కళ, విద్య, వ్యాపారం, లేదా క్రీడల్లో అసాధారణ సామర్థ్యం కలిగిన వారికి ఇవ్వబడుతుంది. అభ్యర్థులు 8 క్రై టీరియాల్లో కనీసం 3ను తీర్చాలి, అంటే ప్రచురిత పేపర్లు, అవార్డులు, హ్యాకథాన్‌లలో పాల్గొనడం, లేదా రంగంలో ప్రముఖుల మద్దతు వంటివి. తనూష్, ఏఐలో 6 సంవత్సరాల అనుభవం, పరిశోధన ప్రచురణలు, పేపర్ రివ్యూలు, హ్యాకథాన్‌ల జడ్జిలో పాల్గొనడం ద్వారా ఈ క్రై టీరియాలను సాధించాడు. హెచ్–1బీ లాటరీ ఆధారితమైనదైతే, హెచ్–1బీ ఐన్‌స్టీన్ మెరిట్ ఆధారితం. ఇది తనూష్ వంటి వారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించింది.
కంటెంట్‌తో కొట్టాడు..
తనూష్ ప్రయాణం కష్టపడటం, స్థిరత్వానికి నిదర్శనం. హెచ్–1బీ వైఫల్యాల తర్వాత, రాత్రి బవళ్లు ఏఐ ప్రాజెక్టులపై పని చేసి, ప్రొడక్టులు అభివృద్ధి చేసి, పరిశోధనలు ప్రచురించారు. సిలికాన్ వ్యాలీలో నెట్‌వర్కింగ్, మెంటర్ల మార్గదర్శకత్వం, ఐబీఎంలో పని అనుభవం వీసా అప్లికేషన్‌ను బలోపేతం చేశాయి. తన LinkedIn పోస్ట్‌లో, ‘లాటరీ కంటే స్థిరత్వం ఎక్కువ ఫలిస్తుంది‘ అని రాసిన తనూష్, కుటుంబం, సహోద్యోగులు, స్నేహితుల మద్దతును కృతజ్ఞతలతో స్మరించారు. ఈ విధానం హెచ్–1బీ వీసా సాధనకు కీలకం. ఎందుకంటే ఇది అభ్యర్థి ప్రొఫైల్‌ను బలంగా నిర్మించాల్సి ఉంటుంది.
తనూష్ కథ భారతీయ ఐటీ నిపుణులకు ప్రేరణాత్మకం, ముఖ్యంగా హెచ్–1బీ లాటరీలో 80% వైఫల్యాలు ఎదుర్కొంటున్న భారతీయులకు. హెచ్–1 వీసా తప్ప, ఎల్–1 (ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్), ఈబీ–1 (గ్రీన్‌కార్డ్) వంటి ఇతర ఆప్షన్లు ఉన్నాయి. తనూష్ సలహా ప్రకారం.. ఏదైనా రంగంలో ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి, ప్రచురణలు చేయండి, కమ్యూనిటీలో కొన్సిస్టెంట్‌గా పాల్గొనండి. సోషల్ మీడియాలో వారి కథ వైరల్ అవ్వడంతో, అభ్యర్థులు టిప్స్ కోరుతున్నారు. ఈ విజయం, వీసా ప్రక్రియలో మెరిట్, కృషి ముఖ్యతను చాటుతుంది.