Akira Nandan And Director Prashanth Neel: మరి కొద్దీ గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు రెండేళ్ల పాటు ఎంత ఆతృతగా ఎదురు చూసారో మనమంతా చూసాము. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలను పక్కన పెట్టి తన రేంజ్ కి తగ్గ గ్యాంగ్ స్టర్ రోల్ చేయడం తో పాటు, ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ లో పేలడంతో అంచనాలు ఎవ్వరూ ఊహించనంత రేంజ్ లో పెరిగింది. ఫలితంగా ఈ చిత్రానికి కనీవినీ ఎరుగని రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కంటెంట్ ని డెలివరీ చేసే విషయం లో ఎంత జాప్యం జరిగినప్పటికీ కూడా ఈ చిత్రం ఓవర్సీస్ నుండి నైజాం వరకు ఆల్ టైం రికార్డు ప్రీ సేల్స్ ని నమోదు చేసుకుంది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్(Akira Nandan) కి థియేటర్ లో సినిమాలను చూసే అలవాటు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది వరకు పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ చిత్రాలను ఆయన థియేటర్స్ లోనే చూసేవాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యాయి. కేవలం పవన్ సినిమాలను మాత్రమే కాదు. ఇతర హీరోల సినిమాలను కూడా ఆయన బాగానే చూస్తాడు. గత ఏడాది ప్రభాస్ కల్కి సినిమాకు, కల్కి టీ షర్ట్ వేసుకొని మరీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో వచ్చి చూసాడు. ఈ వీడియో చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. ఇక నేడు ప్రీమియర్ షో కి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ థియేటర్ లో అకిరా నందన్, ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి సినిమాని చూడబోతున్నాడట.
మరి ఏ థియేటర్ కి వస్తాడు?, ఎక్కడ చూస్తాడు అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. సీక్రెట్ గా వచ్చి చూసి వెళ్తారని టాక్. ఎందుకంటే గతం లో పుష్ప 2 ప్రీమియర్ షో సమయం లో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి రావడం, ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు ఎలాంటివో మనమంతా చూసాము. ఇప్పుడు అకిరా నందన్ ఎక్కడికి వచ్చి సినిమా చూడబోతున్నాడో అభిమానులకు తెలిస్తే మళ్లీ అలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అకిరా నందన్ గోప్యంగా ఈ సినిమాని థియేటర్స్ లో అభిమానుల మధ్య చూసి వెళ్లాడని టాక్. చూడాలి మరి గతం లో లాగానే ఈసారి కూడా ఆయనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వస్తాయో లేవో అనేది.