Congress Party: కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఎవరైనా మార్చుకోమని చెప్పినా.. సలహా ఇచ్చినా అదిపెద్ద నేరంలాగా మారిపోయింది. కాంగ్రెస్ లో అసలు తీసుకోవడం లేదు. రెండు మూడు రోజుల క్రితం ఒడిసాలో జరిగిన సంఘటన ఆశ్చర్యమేసింది. మహ్మద్ మోకిన్ ఈయన 2019-2024 వరకూ కటక్ లోని బారాబతి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే. వాళ్ల అమ్మాయి సోఫియా ఫిర్దౌస్ ఇప్పుడు 2024లో ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా ఆయన 5 పేజీల లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్ పరిస్థితి మారాలంటే ఏం చేయాలన్నది రాశాడు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా 80 ఏళ్ల ఖర్గే సరిగ్గాపనిచేయడం లేదని.. రాహుల్ అయితే అందుబాటులో ఉండడం లేదని.. ప్రియాంక గాంధీకి సెంట్రల్ రోల్ ఇవ్వాలని.. సచిన్ పైలెట్, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ను ప్రోత్సహించారని కోరారు. ఒడిశాలో ఇలా ఉంటే కాంగ్రెస్ దెబ్బతింటుందని.. సోనియా పునరాలోచించాలని రాశాడు.
మహ్మద్ మోకిన్ రాసిన లేఖను కాంగ్రెస్ పరిగణలోకి తీసుకోవాలి. కానీ అధిష్టానం ఏం చేసిందో తెలుసా? నిన్ను ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేశారు. కాంగ్రెస్ ఎలా తయారయ్యిందో దీన్ని బట్టి అర్థమవుతోంది.
రాహుల్ గాంధీ ఓట్ చోరీ పై బెంగళూరులో మాట్లాడుతే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలదీస్తే ఆయనకు కాల్ చేసి రాజీనామా చేయించారు. మాజీ సీఎం ఫృథ్వీరాజ్ చౌహాన్ నిన్న ఆపరేషన్ సింధూర్ అట్టర్ ఫ్లాప్ అని.. ఒక ఫ్లైట్ ఎగరలేదని.. పాకిస్తాన్ వాదన చేసినట్టు చేశాడు. ఆర్మీ అబద్ధాలు చెబుతోందని రాస్తే ఆయన మీద చర్యలు లేవు.
వరుస వైఫల్యాల తర్వాత కూడా కాంగ్రెస్ లో మార్పు రాదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.