Jagan vs Sharmila : 2024 అసెంబ్లీ ఎన్నికలు జగన్ కు అనుకోని షాక్ ఇచ్చింది. ఎప్పుడూ ఊహించలేనంతగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ప్రజలు తీర్పునిచ్చారు. ప్రతిపక్ష హోదాకు పదిశాతం సీట్లు రావాలి.
తనకు ప్రతిపక్ష హోదా కావాలని.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు బెంగళూరులో కూర్చొని లేఖ రాశారు. రాజ్యాంగం ప్రకారం 10 శాతం సీట్లు పైనున్న పార్టీకే ప్రతిపక్ష హోదా ఇస్తారు. స్పీకర్ దయాదాక్షిణ్యాలపై జగన్ ఆధారపడాలి తప్పితే సొంతంగా అడిగి దక్కించుకునే పరిస్థితి లేదు.
అసెంబ్లీకి రాకుండా బెంగళూరులో ప్యాలెస్ లో ఉండి లేఖ రాయకుండా గెలిపించిన పులివెందుల ప్రజల కోసం అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా జగన్ అని విశ్లేషఖులు కౌంటర్ ఇస్తున్నారు.
ప్రజాతీర్పును గౌరవించకుండా ఈవీఎంల మీద నెపం వేస్తున్న జగన్ తీరు చూస్తుంటే.. ఆయన వచ్చే ఎన్నికల వరకూ మరింత దిగజారుతాడని అనిపిస్తోంది. ఆయన స్థానంలో చెల్లెలు షర్మిల ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.
భవిష్యత్తులో షర్మిల పైపైకి, జగన్ కిందకు వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.