Kalki Movie: ఇంతకీ కల్కి మూవీలో ‘కల్కి’ ఎవరు.?

Kalki Movie: ప్రభాస్ నుంచి ఎప్పుడు సినిమా వస్తుందా అని ఎదురుచూసిన బాలీవుడ్ జనాలకి ఇదొక కన్నుల పండుగగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ను చూసిన వాళ్ళందరూ కూడా సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.

Written By: Gopi, Updated On : June 28, 2024 3:14 pm

Who is Kalki in Kalki movie

Follow us on

Kalki Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కల్కి సినిమా హవా నడుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా విశేషాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా వైడ్ గా ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతుందంటూ ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అయితే ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు.

ప్రభాస్ నుంచి ఎప్పుడు సినిమా వస్తుందా అని ఎదురుచూసిన బాలీవుడ్ జనాలకి ఇదొక కన్నుల పండుగగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ను చూసిన వాళ్ళందరూ కూడా సంబ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఇక ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీదనే ఇలాంటి సినిమా రాకపోవడం వల్ల వాళ్లు ఒకంతుకు ఆశ్చర్యానికి గురవుతూనే తమ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చేసే టాలెంటెడ్ డైరెక్టర్లు ఎవరు లేరు అంటూ సోషల్ మీడియా వేదికగా సినిమా అభిమానులు విపరీతమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే కల్కి యూనివర్స్ లో భాగంగా వచ్చే కల్కి 2 సినిమాలో ఎవరు కల్కి పాత్రలో కనిపిస్తారు అనేదాని మీద చాలా రకాల చర్చలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద పలు రకాల ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కల్కి క్యారెక్టర్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక భైరవగా ప్రభాస్ అభిమానులను మెప్పిస్తున్నాడు. కాబట్టి కల్కి పాత్రలో వచ్చే హీరో ఎవరు అనేదాని మీదనే మొదటి నుంచి కూడా తీవ్రమైన ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒక పాన్ ఇండియా హీరో ఆ క్యారెక్టర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అనే వివరాలను తొందర్లోనే నాగ్ అశ్విన్ తెలియజేయబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…