Vijaysai Reddy: వైసీపీలో నెంబర్ 2 ఎవరంటే.. కచ్చితంగా విజయసాయిరెడ్డి పేరు వచ్చేది. అక్రమాస్తుల కేసుల్లో జగన్ ఏ1 ముద్దాయి కాగా.. విజయసాయిరెడ్డి ఏ2గా ఉండేవారు. ఎన్నికల్లో జగన్ ఆదేశాలతో నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు విజయసాయిరెడ్డి. కానీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పెద్దగా కనిపించడం లేదు. కనీసం వాటిని పై నిర్వహించిన సమీక్షలో సైతం దర్శన భాగ్యం లేదు. కనీసం మీడియాకు సైతం అందుబాటులో లేరు. దీంతో విజయసాయిరెడ్డి ఎక్కడికి వెళ్లారు అంటూ ఎక్కువమంది ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం. ఓటమి బాధతో ఉన్న ఆయనకు కేసుల భయం వెంటాడుతోంది. అందుకే ఆయన కేంద్ర పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
2014లో అయితే టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. చివరకు న్యాయమూర్తులు హాజరయ్యే ఫంక్షన్లకు సైతం వెళ్లేవారు. వారితో మాట కలిపేవారు. పరిచయం పెంచుకునేవారు. అవసరమైతే కొందరితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకునేవారు. టిడిపి, బిజెపి మధ్య గ్యాప్ పెంచడంలో సైతం ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వెళ్లేంతవరకు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించేవారు. అందుకే ఈసారి అటువంటి పరిస్థితి కల్పించాలన్న ఆరాటం విజయసాయిరెడ్డి లో ఉంది. అయితే అప్పట్లో ఆయన పార్లమెంటరీ పార్టీ నేత. ఈసారి కుదిరే పని కాదు. కేవలం ఆయన రాజ్యసభ పక్ష నేత మాత్రమే. అందుకే కేంద్ర పెద్దలతో తనకున్న చనువును ఉపయోగించుకొని దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు.
ఈసారి కచ్చితంగా పాత కేసులు తెరపైకి వస్తాయని విజయసాయిరెడ్డికి తెలుసు. తనను తాను కాపాడుకోవాలన్నది కూడా తెలుసు. అందుకే దొరికిన కేంద్రమంత్రి ఇంటికి వెళ్లి పరిచయాలు పెంచుకుంటున్నారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు ఒక్క అడుగు ముందుకు వేయలేక పోయారు. కుమార్తె కంపెనీ పేరుతో వందల ఎకరాలు కొట్టేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రైల్వే మంత్రిని కలిసి విశాఖ మెట్రో గురించి అడిగినట్లుగా ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ట్విట్టర్ ఖాతా చూస్తే హడలెత్తి పోవాల్సిందే. చంద్రబాబుతో పాటు లోకేష్ ను తూలనాడేవారు. ఇప్పుడు అధికారం పోయేసరికి పాతివ్రత్యం చూపిస్తున్నారు. ముందుగా ఆయన విశాఖలో నిర్వాకాల గురించి బయటపడకూడదన్న భయంతోనే ఇవన్నీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఎవరు దొరికితే వాళ్ళ దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టేసుకునే రకం అని ఢిల్లీ వర్గాల్లో ఒక రకమైన ప్రచారం ఉంది. అయితే ఆయన విషయంలో టిడిపి జాగ్రత్త పడుకుంటే మాత్రం గత పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ ఆ చాన్స్ లేదని.. ఎన్డీఏ సుస్థిరతకు ఇప్పుడు టిడిపి కీలకమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తానికి అయితే ఢిల్లీలో విజయసాయిరెడ్డి పెద్ద లాబింయింగ్ నడుపుతున్నారు.