Atal Bihari Vajpayee : అటల్ బిహారి వాజ్ పేయి.. ఈ పేరు తెలియని వారు లేరు. కాకపోతే కొత్తతరం వాళ్లకు ఆయన ప్రధానిగా తెలుసు. పాతతరం వాళ్లకు జనాలను ఉర్రూతలూగించిన వాడిగా వాజ్ పేయికి పేరుంది. ఒకప్పుడు వాజ్ పేయి ప్రసంగాలు నాటి యువతను ఎంతో ఉత్తేజిత పరిచేవి. అంతటి మంచి వక్త. అది హిందీ అయినా ఇతర భాషలు అయినా కవితలతో వాజ్ పేయి చేసే ప్రసంగం అత్యంత ఆకట్టుకుంటోంది. అదొక మరుపురాని మధురానుభూతి. పార్లమెంట్ లో ప్రసంగాలు అయితే ఊపేసేవి.
మరి ఇప్పుడు మరో వాజ్ పేయి ఉత్తరాదిన ఆవిర్భవించాడా? నిన్నా మొన్నా.. రాజ్యసభలో మినిస్టరీ ఆఫ్ హోం ఎఫైర్స్ మీద చేసిన ప్రసంగాలు చూస్తే వాజ్ పేయి మరో రూపం కనిపించిందని అందరూ అంటున్నారు. కవితలు, శాయిలీరలతో సుధాంసు త్రివేదీ చేస్తున్న ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి. గణాంకాలతో చెబుతున్న తీరు ఆకట్టుకుంటోంది.
ఈ నేత వాజ్ పేయి లాగా లక్నో నుంచే వచ్చాడు. ఈయనది జన్మభూమి లక్నో.. 54 ఏళ్ల వయసులో అద్భుత ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నాడు. వచ్చే 10 ఏళ్లలో బీజేపీలో అత్యున్నత స్థాయికి ఎదిగే ముఖ్యనాయకుడిగా సుధాంసు త్రివేది నిలవబోతున్నాడు.
మెకానికల్ ఇంజినీరింగ్ లో డాక్టరేట్ చేసిన బాగా చదువుకున్న మేధావిగా పేరుగాంచాడు. వాజ్‍పేయి ప్రసంగాన్ని పోలిన మరో నవతరం నేత ప్రసంగాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.