National Herald Case: నిన్న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాల ముందు ధర్నా చేశారు. కారణం ఏంటంటే.. ఢిల్లీ కోర్టు సోనియా, రాహుల్ ల మీద కేసు కొట్టివేసినందుకు బీజేపీ కార్యాలయాల ముందు ధర్నా చేశారు. కేసు ఎందుకు కొట్టివేసింది. వారిని నిర్దేశంగా ప్రకటించిందా? అంటే అది ఏమీ సామాన్యులకు తెలియదు. ఏంటీ కోర్టు కేసు అంటే..
నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సోనియా, రాహుల్ లు స్వాహా చేశారని సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకెక్కారు. కోర్టు మూలాల్లోకి వెళ్లలేదు.నిర్ధారించలేదు. ఈడీ కంప్లైంట్ నమోదు చేసిందో ఆ ఫిర్యాదు సాంకేతికపరంగా చెల్లదని తీర్పునిచ్చారు.
సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేస్తే ఏదో ఒక దర్యాప్తు ఏజెన్సీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరిపి కోర్టుకు సబ్ మిట్ చేసింది.
ఒక వ్యక్తి కంప్లైంట్ మీద ఈడీ కేసు నమోదు చేయడానికి లేదు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన దర్యాప్తును కొనసాగించి ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టుకు రండి అని తీర్పునిచ్చింది. సాంకేతికపరమైన అంశాలపై కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు ప్రాపర్ గా చేయాలని కోర్టు సూచించింది. ఈ తీర్పును కాంగ్రెస్ క్యాష్ చేసి నానా యాగీ చేసింది.
దేశ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
