Jagan : జగన్ ఢిల్లీ ధర్నాకు కేవలం ప్రాంతీయ పార్టీలే ఎందుకొచ్చాయి?

జగన్ ఢిల్లీ ధర్నాకు ప్రాంతీయ పార్టీల నేతలను పిలిచాడు. సమాజ్ వాదీ, శివసేన , డీఎంకే, టీఎంసీ, అన్నాడీఎంకే, ఆప్, ముస్లిం లీగ్ సహా ప్రాంతీయ పార్టీల నేతలు వచ్చి జగన్ కు మద్దతు తెలిపారు.

Written By: NARESH, Updated On : July 27, 2024 6:06 pm

Jagan : జగన్ నిన్న ఢిల్లీలో ధర్నా చేశాడు. ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అయిపోయినట్టు.. అసలు సామాజిక పరిస్థితి.. శాంతిభద్రతలు దెబ్బతిన్నట్టు.. హత్యలే హత్యలు జరుగుతున్నట్టు.. పోలీసులు సైడ్ తీసుకొని వైసీపీ నేతల హత్యకు సహకరిస్తున్నట్టు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.

పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలని జగన్ కోరాడు. జగన్ ఈ మాట చెబితే ఆంధ్రప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేరు. ఆంధ్రాలో అలా 40 మంది హత్యకు గురయ్యారని జగన్ ఆరోపించాడు.

జగన్ ఢిల్లీ ధర్నాకు ప్రాంతీయ పార్టీల నేతలను పిలిచాడు. సమాజ్ వాదీ, శివసేన , డీఎంకే, టీఎంసీ, అన్నాడీఎంకే, ఆప్, ముస్లిం లీగ్ సహా ప్రాంతీయ పార్టీల నేతలు వచ్చి జగన్ కు మద్దతు తెలిపారు.

ఏ ప్రభుత్వం వచ్చినా 6 నెలలు ఆగుతారు. కానీ జగన్ మూడు నెలలకే మొదలుపెట్టాడు. ప్రాంతీయ పార్టీల నేతలందరూ హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు రాలేదు. కాంగ్రెస్ కూటమిలోని అందరూ హాజరు కావడం విశేషం. సజ్జల మాత్రం మేం పిలిచిన వారే వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ను ఎందుకు పిలవలేదన్నది హాట్ టాపిక్ గా మారింది.

జగన్ ఢిల్లీ ధర్నాకు కేవలం ప్రాంతీయ పార్టీలే ఎందుకొచ్చాయి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.