https://oktelugu.com/

Trivikram-Pawan Kalyan : త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ పెరిగిందా..? వీళ్ళ మధ్య అసలేం జరిగింది..?

మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయం లోనే పవర్ స్టార్ గా ఎదిగాడు...

Written By:
  • Gopi
  • , Updated On : July 27, 2024 / 03:18 PM IST
    Follow us on

    Trivikram-Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి మామూలు క్రేజ్ లేదు. ఆయన చేసిన సినిమాలు సక్సెస్ అవ్వడం ఓకేత్తు అయితే, ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఆయన స్టార్ డమ్ అనేది విపరీతంగా పెరిగడంమరొక ఎత్తనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా రాజకీయంగా కూడా ఎదిగారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తనదైన బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక ఇదే క్రమంలో ఆయన ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళితే వచ్చే ఎన్నికల వరకు ఆయన సీఎం అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొక మూడు నెలల్లో షూటింగ్లో పాల్గొనబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి అనుకూలంగానే ఆయన ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా తనదైన రీతిలో షూటింగ్ ల్లో పాల్గొంటూ తన బాధ్యతలను కొనసాగిస్తు ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా గానీ, సినిమాలు చేసే సమయంలో గానీ తనకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఏం చేయాలి ఎలా చేయాలి అనే దానిమీద ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించి పవన్ కళ్యాణ్ కు అప్డేట్ ఇస్తూ ఉండేవాడు. ఇలాంటి క్రమంలోనే బీమ్లా నాయక్, బ్రో లాంటి సినిమాలను కూడా చేసి ఆ సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ భారీ రెమ్యూనరేషన్ ను కూడా పొందాడు.

    మరి ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ తన పార్టీని నడుపుకోవడానికి ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బులే అతనికి చాలా వరకు హెల్ప్ అయ్యాయి అంటూ ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశాడు… అయితే ఇప్పుడు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల మధ్య గ్యాప్ వచ్చింది అంటూ కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలం లో వీరిద్దరూ ఎక్కడ కూడా కలిసి కనబడలేదు. అందువల్లే ఈ వార్తలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అంటూ మరి కొంతమంది వాటి మీద వివరణ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే పనుల్లో బిజీగా ఉన్నాడు.

    కాబట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎక్కువగా కలవడం లేదని అలాగే త్రివిక్రమ్ కూడా తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండడం వల్ల వీరిద్దరూ తరుచుగా కలుసుకోలేకపోతున్నారు. అంతే తప్ప వీళ్ళ మధ్య దూరం అయితే పెరగలేదని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ తనకి హెల్ప్ చేసిన వాళ్లకి అన్యాయమైతే చేయడు. కాబట్టి ఇప్పటికి కూడా తివిక్రమ్ తో మంచి మాటలే కొనసాగిస్తున్నారు.

    వీలైతే వీళ్ళ కాంబో లో మరొక సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కొంతమంది నిర్మాతలు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే వీళ్ల మధ్య గ్యాప్ పెరగలేదు. కానీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్స్ వల్లే వీళ్ళు ఎక్కువగా కలవలేకపోతున్నారు అనేది వాస్తవంగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కొంతమంది కావాలనే ఈ విమర్శలను చేస్తూ వాటిని హైలెట్ చేస్తున్నారంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ చేయిన ఒక్క సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం లేదు. కానీ వచ్చే సంవత్సరం మూడు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి..