https://oktelugu.com/

Annamalai : అన్నామలై ఓటమిపై సమగ్ర విశ్లేషణ

అన్నామలై ఓటమిపై ‘రామ్’ గారి సమగ్ర విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : June 8, 2024 3:03 pm

    Annamalai : కోయంబత్తూరు పార్లమెంట్ ఎన్నిక దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీనికి ఒక ఒక కారణం..అన్నామలై పోటీ చేయడమే ఇందుకు కారణం.. నిజం చెప్పాలంటే పార్టీలకు అతీతంగా అన్నామలై గెలవాలని కోరుకున్నారు. అయినా అన్నామలై ఎందుకు ఓడిపోయాడు.. కారణాలు ఏంటి?

    2014లోనే అన్ని పార్టీలు స్వతంత్రంగా పోటీచేశాయి. డీఎంకే, కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీజేపీలు విడిగా పోటీచేశాయి. పశ్చిమ తమిళనాడులోని కొంగునాడు అన్నాడీఎంకే కు పట్టున్న ప్రాంతం.. కోయంబత్తూరు ఈ ప్రాంతంలోనే ఉంది.

    అన్నామలై కోయంబత్తూరులో ఓటమికి మూడు కారణాలున్నాయి. అన్నాడీఎంకే ఓట్లు కోయంబత్తూరులో సైలెంట్ గా సీక్రెట్ గా డీఎంకే ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. ఇక అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో రాష్ట్రమంతా పర్యటించడం వల్ల తన నియోజకవర్గంలో కాన్ సన్ ట్రేట్ చేయలేకపోయాడు.

    మూడోది కోయంబత్తూరులో రెండు గ్రామీణ నియోజకవర్గాలున్నాయి. అక్కడ బీజేపీకి ఓట్లు పడలేదు. ఇది కూడా అన్నామలై ఓటమికి కారణంగా చెప్పొచ్చు.

    అన్నామలై ఓటమిపై ‘రామ్’ గారి సమగ్ర విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    అన్నామలై ఓటమిపై సమగ్ర విశ్లేషణ || Reasons Behind K Annamalai Lost In Coimbatore || Ram Talk