Homeఎంటర్టైన్మెంట్Star Heroine: ఒకప్పటి స్టార్ హీరోయిన్, పెళ్లితో సినిమాలకు దూరం... కట్ చేస్తే రూ. 1300...

Star Heroine: ఒకప్పటి స్టార్ హీరోయిన్, పెళ్లితో సినిమాలకు దూరం… కట్ చేస్తే రూ. 1300 కోట్లకు అధిపతి!

Star Heroine: పైన ఫోటోలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న చిన్నారి ఒకప్పటి టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కోట్ల ఆస్తి సంపాదించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ కి పరిమితం అయ్యారు. ఆమె ఇండస్ట్రీలో ఉంది తక్కువ కాలమే అయినా బాగా పాపులర్ అయ్యారు. చేసింది కొన్ని సినిమాలే కానీ టాలీవుడ్(Tollywood) టు బాలీవుడ్(Bollywood) ఆమె పేరు మార్మోగింది.

ఆమె ఎవరో కాదు కేరళ బ్యూటీ ఆసిన్. చాలా చిన్న వయసులో ఆసిన్(Asin) హీరోయిన్ గా మారింది. కేరళలోని కొచ్చి లో ఆసిన్ జన్మించారు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది ఆసిన్. 2001లో విడుదలైన నరేంద్ర మగన్ జయకాంతన్ వగా మకన్ సినిమాలో మొదటిసారి నటించింది. ఇప్పుడు ఆసిన్ వయసు 15 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ‘ సినిమాలో నటించింది.

Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మి విడాకుల వెనుక ఇంత తతంగం నడిచిందా?

ఈ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి. నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఆమె పలు హిట్ సినిమాల్లో అద్భుతమైన నటనతో మెప్పించింది. అటు తమిళంలో విజయ్, అజిత్, సూర్య, కమల్ హాసన్, విక్రమ్ సరసన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు బాలీవుడ్ లో కూడా బడా హీరోలతో జత కట్టింది.

Also Read: Ramoji Rao: యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే… రామోజీ పరిచయం చేసిన స్టార్ హీరోలు వీరే!

అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ వంటి నటులతో కలిసి నటించింది. బాగా సంపాదించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆసిన్ ఓ వ్యాపారవేత్త ను వివాహం ఆడింది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మతో ప్రేమలో పడింది. 2016లో అతడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది ఆసిన్. ఆమెకు ఆరిన అనే ఆరేళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం ఆసిన్ ఆస్తి విలువ రూ. 1300 కోట్లకు పైమాటే అని సమాచారం.

Exit mobile version