CPM : ఆరు రోజులు సీపీఎం మహాసభలు మధురైలో జరుగుతున్నాయి. మధురై తమిళులకు సాంస్కృతిక రాజధాని. ఒకనాడు కమ్యూనిస్టుల కంచుకోట.. మనకు విజయవాడ ఎలాగైతే కంచుకోటనో.. తమిళనాడు మధురై కూడా సీపీఎంకు కంచుకోట.. ఇప్పుడు మాత్రం అంత బలం లేదు సీపీఎంకు అక్కడ..
రోజురోజుకు ప్రతిష్ట సీపీఎంది తగ్గిపోతోంది. బలం తగ్గిపోతోంది. సీపీఎం నేతలే పేర్కొంటున్నారు. దీన్ని ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తున్నారు. ఈసారి జాతీయ మహాసభలకు ప్రత్యేకత ఉందా?
చాలా రాష్ట్రాల్లో కేంద్రాల్లో పాతతరం సీపీఎం నాయకులు పోయి కొత్త తరం ముందుకొచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది కొత్త వారు వచ్చారు. తెలంగాణ నుంచి జాన్ వెస్లీ, ఎస్ వీరయ్య.. జ్యోతి, ఎం సాయిబాబు.. అదే
ఆంధ్రా నుంచి బి. రమాదేవి, కే లోకనాథం లాంటి వారు తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికయ్యారు. యువకులు.. దేశంలో సెంట్రల్ కమిటీలో కూడా ఇలానే వచ్చారు. కార్యదర్శిగా ఎంఏ బేబీ వచ్చారు. కొంచెం ఎనర్జీ ఉన్న మనిషి. ఈయన వల్ల పార్టీ పునరుత్తేజం చెందుతుందా? సీపీఎం ను ఈయన నిలబెట్టగలరా? నాయకుడిపై ఒక పరిశీలన చేద్దాం.
పాత తరం పోయే కొత్త తరం వచ్చే మరి సీపీఎం గతి మారేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.